Share News

Viral: నాకు సిగ్గేలేదంటూ రెచ్చిపోయిన మహిళ.. మెట్రోలో పురుషులకు భారీ షాక్!

ABN , Publish Date - Apr 22 , 2024 | 09:10 PM

ఢిల్లీ మెట్రోలో ఓ మహిళ ఊహించని పని చేసింది. సీట్లు ఖాళీ లేకపోవడంతో వెళ్లి ఓ అపరిచిత పురుషుడి ఒళ్లో కూర్చుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Viral: నాకు సిగ్గేలేదంటూ రెచ్చిపోయిన మహిళ.. మెట్రోలో పురుషులకు భారీ షాక్!

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ మెట్రో (Delhi Metro) పేరు నిత్యం తరచూ ట్రెండింగ్‌లోకి వస్తుంటుంది. ప్రయాణికుల మధ్య గొడవలు, ప్రేమికుల వెకిలి చేష్టలు, రీల్స్ కోసం వింత ప్రయోగాలు..ఇలా ఏదో కారణంతో మెట్రో పేరు నెట్టింట వైరల్‌ (Viral) అవుతుంటుంది. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సీటు దొరకని ఓ ప్రయాణికురాలు తనకు సిగ్గులేదంటూ చేసిన పని ఇతర ప్రయాణికులు అందరూ దిమ్మెరపోయేలా చేసింది.

Viral: అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన మహిళ.. ఇన్సూరెన్స్ ఉందన్న నమ్మకంతో ఆసుపత్రిలో చేరితే..


వీడియోలో కనిపించినదాని ప్రకారం, ఓ ప్రయాణికురాలు మెట్రో ఎక్కింది. అయితే, ఆమె ఎక్కిన కోచ్‌లో ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. దీంతో, అక్కడున్న కొందరు పురుష ప్యాసెంజర్లను మర్యాద కోసమైనా సీటు ఖాళీ చేసి ఇవ్వమని అడిగింది. వారిలో ఒక్కరు కూడా స్పందించలేదు. ఈ క్రమంలో మరో యువకుడిని తనకు సీటు ఇమ్మని అడిగింది. అతడూ మిన్నకుండిపోయాడు. దీంతో, ఆమె ఊహించని విధంగా అతడి ఒళ్లో కూర్చుండిపోయింది. దీంతో, ఆ పక్కనే కూర్చున్న మరో ప్రయాణికుడు ఇబ్బంది పడుతూ ఠక్కున లేచాడు. ‘‘మీకు సిగ్గు లేనప్పుడు నాకెందుకు సిగ్గు’’ అని అసేసింది (Woman Forcibly Sits on Man's Lap Inside Delhi Metro).

ఈ ఘటన ఎప్పుడు జరిగిందీ తెలీదు కానీ జనాలకు మాత్రం బాగా ఆగ్రహం తెప్పించింది. అనేక మంది ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ ఢిల్లీ పోలీసులు, మెట్రో అధికారులను ట్యాగ్ చేశారు. మహిళపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2024 | 09:15 PM