Share News

Viral: దోశ ఆర్డరిచ్చిన మహిళకు భారీ షాక్.. రెండు ముక్కలు తిన్నాక డౌటొచ్చి కిందకు చూస్తే..

ABN , Publish Date - Mar 16 , 2024 | 09:53 PM

ఢిల్లీలోని ఓ పాప్యులర్ రెస్టారెంట్‌లో దోశ ఆర్డరిచ్చిన మహిళకు భారీ షాక్ తగిలింది. దోశలో ఏకంగా 8 బొద్దింకలు కనిపించడంతో ఆమె షాకైపోయింది.

Viral: దోశ ఆర్డరిచ్చిన మహిళకు భారీ షాక్.. రెండు ముక్కలు తిన్నాక డౌటొచ్చి కిందకు చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని ఓ పాప్యులర్ రెస్టారెంట్‌లో(New Delhi Restaurant) దోశ ఆర్డరిచ్చిన మహిళకు భారీ షాక్ తగిలింది. దోశలో ఏకంగా 8 బొద్దింకలు (Cockroaches in Dosa) కనిపించడంతో ఆమె షాకైపోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం, ఈ ఘటన గురించి ఆమె నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం వైరల్‌గా (Viral) మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: భార్య తనకు సొంత చెల్లెలు అవుతుందని పెళ్లైన 6 ఏళ్లకు తెలిసి..

ఇషానీ అనే మహిళ కాన్నాట్ ప్లేస్‌లో ఓ ఫేమస్ రెస్టారెంట్‌కు తన ఫ్రెండ్‌తో సహా వెళ్లింది. అక్కడ వాళ్లు రెండు దోశలు ఆర్డరిచ్చారు. రెండు ముక్కలు తిన్నాక ఇషానీకి దోశలో ఎదో వింతగా కనిపించింది. కాస్తంత పరిశీలనగా చూస్తే అది బొద్దింక అని తేలింది. దీంతో, దోశను జాగ్రత్తగా పరిశీలిస్తే మొత్తం ఎనిమిది బొద్దింకలు బయటపడ్డాయి. దీంతో, ఆ దృశ్యం చూసి ఆమెకు వాంతి వచ్చినంత పనైంది.

Viral: ట్రాఫిక్‌లో యువతిని అదేపనిగా ఫాలో అయిన ఆటోవాలా.. ఆమె స్కూటీ ఆగిపోగానే ఊహించని విధంగా..


రెస్టారెంట్ యాజమాన్యం తీరుపై ఆగ్రహంతో ఊగిపోయిన ఇషానీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు వచ్చి రెస్టారెంట్ యాజమాన్యాన్ని లైసెన్స్ చూపించమని కోరగా వారి వద్ద ఎటువంటి అనుమతులు లేవని తేలింది. దీంతో, ఇషానీ నివ్వెరపోయింది. ఇంతటి రద్దీ ప్రదేశంలో లైసెన్స్ లేకుండా రెస్టారెంట్ ఎలా నిర్వహిస్తున్నారో తనకు ఆర్థం కాలేదని ఆమె నెట్టింట ఆవేదన వ్యక్తం చేసింది.

రెస్టారెంట్‌ వంట గది అంతా అపరిశుభ్రంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. దుర్గంధ భూయిష్టంగా ఉందని మండిపడింది. వంటగది పైకప్పులో కొంత భాగం లేదని కూడా చెప్పింది. పరిశుభ్రత తన హక్కని స్పష్టం చేసిన ఆమె ఈ దారుణాన్ని మౌనంగా భరించలేకపోయానని తెలిపింది. రెస్టారెంట్‌పై అధికారులు చర్యలు తీసుకునే వరకూ పోరాడుతానని వెల్లడించింది. తన హక్కుల కోసం పోరాడిన ఆమెపై నెట్టింట ప్రశంసల జల్లు కురిసింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 10:00 PM