Share News

Viral Video: ఇది పిచ్చి కాకపోతే మరేంటి? చిటారు కొమ్మ ఎక్కి డ్యాన్స్ ఎలా చేస్తోందో చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Apr 09 , 2024 | 01:43 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో రీల్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నెటిజన్ల దృష్టిని ఆకర్షించడం కోసం, వ్యూస్, లైక్స్ సాధించడం కోసం కొందరు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. విచిత్రమైన ఆలోచనలతో వీడియోలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఇది పిచ్చి కాకపోతే మరేంటి? చిటారు కొమ్మ ఎక్కి డ్యాన్స్ ఎలా చేస్తోందో చూడండి.. వీడియో వైరల్!

ప్రస్తుత డిజిటల్ యుగంలో రీల్స్‌కు (Reels) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నెటిజన్ల దృష్టిని ఆకర్షించడం కోసం, వ్యూస్, లైక్స్ సాధించడం కోసం కొందరు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. విచిత్రమైన ఆలోచనలతో వీడియోలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు (Viral Video).


miss_pooja అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి సాంప్రదాయ దుస్తులు ధరించి చెట్టు ఎక్కింది. చిటారు కొమ్మ వరకు ఎక్కి నిల్చుంది. అనంతరం అక్కడ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది (Dance on Tree). లెహంగా, చున్నీ వేసుకుని ``చైన్ మేరా ట్యూనే లే లియా`` పాటకు అత్యంత ప్రమాదకర పరిస్థితులో డ్యాన్స్ వేసింది. ఆమె డ్యాన్స్‌ను కింద ఉన్న వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దాదాపు 2.5 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``భారతీయ నృత్యం ఇంత ఎత్తుకు చేరుకోవడం గర్వకారణం``, ``ఈ గ్రామంలో జియో టవర్‌లను ఇన్‌స్టాల్ చేయకూడదు``, ``రీల్స్ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఇది నిజమా? గ్రాఫిక్సా?.. రాయి మీద నీళ్లు పోయగానే షాక్.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వేగంగా వస్తున్న రైలు.. పట్టాలపై ఆగిపోయిన లారీ.. తర్వాతేం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2024 | 01:43 PM