Share News

Viral Video: ఉడుమును ఓ పట్టు పట్టింది.. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో వైరల్..

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:13 AM

ఉడుము అని పిలుచుకునే బల్లి జాతికి చెందిన జీవి చాలా ప్రమాదకరమైనది. దాని పట్టుకు చిక్కితే తప్పించుకోవడం కష్టం అంటారు. అలాంటి ఉడుముకే తన పట్టు రుచి చూపించింది ఓ మహిళ. ఒట్టి చేతులతోనే ఉడుమును పట్టుకుని తన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఉడుమును ఓ పట్టు పట్టింది.. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో వైరల్..
woman caught the monitor lizard with her bare hands

సాధారణంగా బల్లి (Lizard) అంటే చాలా మంది భయపడతారు. బల్లిని పట్టుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఇక, బల్లి జాతికే చెందిన పెద్ద జీవులను చూస్తే భయమేస్తుంది. ఉడుము (Monitor lizard ) అని పిలుచుకునే బల్లి జాతికి చెందిన జీవి చాలా ప్రమాదకరమైనది. దాని పట్టుకు చిక్కితే తప్పించుకోవడం కష్టం అంటారు. అలాంటి ఉడుముకే తన పట్టు రుచి చూపించింది ఓ మహిళ. ఒట్టి చేతులతోనే ఉడుమును పట్టుకుని తన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు (Viral Video).


invincible._ajita అనే ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బిలాస్‌పూర్‌‌లో ఓ ఇంట్లో చిత్రీకరించారు. ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయిన ఉడుము గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హెడ్ అజితా పాండే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్‌లో ఉన్న జంతువును కర్ర సహాయంతో పైకి లాగి చేతులతోనే పట్టుకుంది. బయటకు రాగానే ఆ ఉడుము ఆమెపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆమె దాని తోకను వదలకుండా పట్టుకుంది. అది తనపై రెండుసార్లు దాడికి ప్రయత్నించినప్పటికీ, ఆమె నిశ్చింతగా ఉండి, ధైర్యంగా రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేసింది.


ఆ ఉడుమును రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ ఉడుముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 4 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 4 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆమె భద్రతా పరికరాలు ధరిస్తే మంచిది``, ``ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్``, ``ఆమెకు అసలు భయం లేనట్టుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వీడియో కోసం ఇదేం పని.. నూతన వధువు తీరు చూస్తే కోపం రాక మానదు.. వీడియో వైరల్..


Viral Video: ఆమె ఓ పని మనిషి.. 30 ఏళ్లు కష్టపడి పని చేసి కొడుకుని చదివిస్తే.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో


Viral Video: వావ్.. ఈ ఎలుగుబంటి చాలా తెలివైంది.. కార్ డోర్ ఎలా తీసిందో చూడండి.. తర్వాత ఏం చేసిందంటే..


IQ Test: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఈ ఫొటోలో రెండు తప్పులు ఉన్నాయి.. 10 సెకెన్లలో కనుక్కోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 23 , 2024 | 11:13 AM