Share News

Viral Video: నడిరోడ్డుపై కాంట్రాక్టర్‌ను చితక్కొట్టిన మహిళ.. ఆమె ఆగ్రహానికి కారణమేంటంటే..

ABN , Publish Date - Jan 12 , 2024 | 09:02 PM

తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ తన యజమానికే చుక్కలు చూపించింది. నడి రోడ్డుపై అతడిని చితక్కొట్టింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ తన భర్తతో కలిసి కాంట్రాక్టర్‌ను చెప్పుతో కొట్టింది.

Viral Video: నడిరోడ్డుపై కాంట్రాక్టర్‌ను చితక్కొట్టిన మహిళ.. ఆమె ఆగ్రహానికి కారణమేంటంటే..

తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ తన యజమానికే చుక్కలు చూపించింది. నడి రోడ్డుపై అతడిని చితక్కొట్టింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ తన భర్తతో కలిసి కాంట్రాక్టర్‌ను (Contractor) చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో మాత్రం సమాచారం లేదు. కానీ, ఈ వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది (Viral Video).

@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఆ వీడియోలో ఓ మహిళ తన మొహాన్ని చున్నీతో కప్పుకుని తన భర్తతో కలిసి ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితక్కొట్టింది. ట్విటర్ యూజర్ షేర్ చేసిన సమాచారం ప్రకారం.. ఆ భార్యాభర్తలు ఆ కాంట్రాక్టర్ దగ్గర కూలి పని చేస్తున్నారు. నాలుగు నెలలుగా అతడు జీతాలు చెల్లించడం లేదు. ఎన్నిసార్లు అడిగినా ఏదో సాకు చెబుతున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దంపతులు ఆ కాంట్రాక్టర్‌ను చితక్కొట్టారు. ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Mukesh Ambani: ముఖేష్ అంబానీని ``కాకా`` అని పిలిచిన వ్యక్తి.. ముఖేష్ ఎంత బాగా స్పందించారంటే..

ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 31 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``కార్మికులకు కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుంది``, ``ఆ కాంట్రాక్టర్‌కు తగిన శాస్తి జరిగింది``, ``ఆ మహిళ ఆగ్రహం మామూలగా లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 09:02 PM