Share News

Gold: ఈ కారణంతో బంగారు నగలు కొంటున్నారంటే... తప్పు చేస్తున్నట్టే!

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:17 PM

పెట్టుబడి పేరిట బంగారు నగలు కొనడం తప్పని నిపుణులు చెబుతున్నారు. దీనికి బదులు డిజిటల్ గోల్డ్,

Gold: ఈ కారణంతో బంగారు నగలు కొంటున్నారంటే... తప్పు చేస్తున్నట్టే!

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు బంగారం అంటే ఎంత మక్కువో చెప్పనక్కర్లేదు. బంగారాన్ని శుభసూచకంగా భావించే భారతీయులు ముఖ్యమైన సందర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తారు. కొందరు బంగారాన్ని (Gold) పెట్టుబడి సాధనంగానూ పరిగణిస్తారు. అయితే.. అనేక ప్రత్యామ్నాయ పెట్టుబడులు అందుబాటులో ఉన్న నేటి జమానాలో వస్తురూపంలో ఉన్న బంగారంపై పెట్టుబడి (Investments) పెట్టడం సరికాదని నిపుణులు చెబుతున్నారు.

భారతీయ కంపెనీల నియామకాల జోరు..


బంగారంపై పెట్టుబడులు ఇలా..

ఆస్తుల విలువ మార్కెట్ పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అయితే, బంగారానికి ఈ ఒడిదుడుకులు తక్కువని అనేక మంది నమ్ముతారు. అంతేకాదు, అత్యవసర సమయాల్లో నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారానికి మించినది లేదనేది కూడా వాస్తవం. అయితే, దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు (Investment in Gold).

బంగారు నగలు కొనేవారు బంగారం ధరతో పాటూ నగల తయారీ చార్జి కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది సగటున పది శాతం వరకూ ఉంటుంది. పెట్టుబడి కోణంలో చూస్తే ఇదంతా వృథా ఖర్చే.

ఇక బంగారు నగలపై 3 శాతం జీఎస్టీ చెల్లిస్తారు. కాబట్టి, జీఎస్టీ ఇన్‌పుట్ లేని వారు ఈ మేరకు కొంత మొత్తం నష్టపోవాల్సిందే.

బంగారు నగలు దాచిపెట్టుకోవడం కూడా ఇబ్బందే. వీటిని సాధారణంగా లాకర్లు లేదా ఇంట్లోని సేఫ్‌లలో దాచిపెడతారు. అయితే, ఇళ్లల్లో దాచుకున్న బంగారం చోరీకి గురయ్యే అవకాశం కొంతవరకైనా ఉంటుంది.

జువెలరీ షాపుల్లో కొనే నగల విషయంలో నాణ్యతకు సంబంధించిన సమస్యలు కూడా ఉండొచ్చు. హాల్‌మార్క్ బంగారాన్ని ఆఫర్ చేస్తున్నారా లేదా అనే సందేహం నిత్యం వేధిస్తుంటుంది. కాబట్టి, ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే వస్తురూపంలో ఉన్న బంగారానికి బందులు గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETFs), గోల్డ్ ఫండ్స్ లేదా డిజిటిల్ గోల్డ్‌లో (Digital Gold) పెట్టుబడులు పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Mar 14 , 2024 | 04:21 PM