Share News

Fuel: విమానంలో ఇంధనాన్ని ఎక్కడ నిల్వ చేస్తారో తెలిస్తే..

ABN , Publish Date - Mar 22 , 2024 | 09:50 PM

విమానంలో ఇంధనాన్ని ఎక్కడ నిల్వ చేస్తారు? దీని వెనకున్న కారణాలు ఏమిటి?

Fuel: విమానంలో ఇంధనాన్ని ఎక్కడ నిల్వ చేస్తారో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: మనషులకు అందుబాటులో ఉన్న అత్యంత వేగవంతమైన ప్రయాణసాధనాల్లో విమానానిది మొదటి స్థానం. అయితే, ఇతర వాహనాల్లాగే విమానానికీ ఇంధనం నిల్వ చేసే ట్యాంకులు ఉంటాయని తెలుసు గానీ అవి ఎక్కడ ఉంటాయనేది చాలా మందికి తెలియదు. దీంతో, నెట్టింట తరచూ ఈ ప్రశ్న ఎదురవుతుంటుంది. విమానయాన (Aviation Sector) నిపుణుడొకరు ఈ ప్రశ్నకు తాజాగా సమాధానం కూడా ఇచ్చారు. అంతేకాకుండా, దీని వెనకున్న ఆసక్తికర అంశాలను కూడా వివరించారు.

Viral: కొందరు ఫారినర్లకు భారత్ అంటే ఎప్పుడూ చిన్న చూపే.. షాకింగ్ వీడియో.. భారతీయుల ఆగ్రహం


నిపుణులు చెప్పే దాని ప్రకారం, విమానం ఇంధనాన్ని దాని రెక్కల్లో నిల్వ చేస్తారు. వినడానికి ఇది కాస్త వింతగా ఉండొచ్చు కానీ ఇది నిజం. విమానం ప్రధాన భాగంలో ఇంధనం నిల్వ చేస్తే కొన్ని సమస్యలు వస్తాయట. ముఖ్యంగా ఎయిరోప్లేన్ బ్యాలెన్స్ నిలుపుకోలేని పరిస్థితి ఏర్పడొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా, ప్రయాణికులు కూర్చునేందుకు, లగేజీ పెట్టేందుకు జాగా ఉండదని అంటున్నారు. అందుకే ఇంధనాన్ని విమానం రెక్కల్లో నిల్వ చేసేలా ఎయిరోప్లేన్లను ఇంజినీర్లు డిజైన్ చేశారు (Why fuel is stored in Aeroplane's wings).

ViralVideo: లీవ్ కావాలంటూ కంపెనీ సీఈఓ వద్దకు వెళ్లిన కొత్త ఉద్యోగి.. చివరకు జరిగిందేంటో చూస్తే..


ఈ తరహా డిజైన్ వెనక మరో ప్రధాన కారణం కూడా ఉందని అంటున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే విమానాల్లో ఇంధనం బరువు దాదాపు ముప్పావు వంతు వరకూ ఉంటుంది. ఇక రెక్కల కారణంగానే విమానం గాల్లోకి లేస్తుంది. దీంతో, రెక్కల్లో ఇంధనాన్ని నింపితే విమానం సులువుగా గాల్లోకి లేచేందుకు అనువుగా ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు అనేక ఇతర కారణాలు కూడా ఉండటంతో ఇంజినీర్లు ఎయిరోప్లేన్ రెక్కల్లో ఇంధనం నిల్వకు మొగ్గుచూపారని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 09:59 PM