Share News

Cake Making: ఛీ..ఛీ.. పిల్లలు తినే కేక్‌ ఇలా తయారు చేస్తారా? ఇది తింటే అనారోగ్యం రావడం గ్యారెంటీ!

ABN , Publish Date - Feb 12 , 2024 | 08:18 PM

కిరాణా దుకాణాల్లో విక్రయించే రంగురంగుల కేక్‌లను తినేందుకు పిల్లలు విపరీతంగా ఇష్టపడతారు. అయితే వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసా?

Cake Making: ఛీ..ఛీ.. పిల్లలు తినే కేక్‌ ఇలా తయారు చేస్తారా? ఇది తింటే అనారోగ్యం రావడం గ్యారెంటీ!

కిరాణా దుకాణాల్లో విక్రయించే రంగురంగుల కేక్‌లను (Cakes) తినేందుకు పిల్లలు విపరీతంగా ఇష్టపడతారు. తక్కువ ధరలో లభించే ఈ రుచికరమైన రంగు రంగుల కేక్‌లు పెద్దలను కూడా ఆకట్టుకుంటాయి. అయితే వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియోలో (Cake Making Video) ఆ కేక్‌ల తయారీ ప్రక్రియను చూపించారు. ఆ వీడియో చూశాక భయం వేయడం ఖాయం. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).

sweetwonders_nasik అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఫ్యాక్టరీలో కేక్‌లను తయారు చేస్తున్నారు. ఒక వ్యక్తి మొదట బకెట్‌లో గుడ్లను పగలగొట్టి, ఆపై వాటిని మెషిన్‌లో వేశాడు. అనంతరం చక్కెర వేసి బాగా కలిపి ఆ మిశ్రమానికి రంగులు కలిపాడు. ఆ తరువాత దానికి పిండిని జోడించి చేతులతో బాగా కలిపాడు. అనంతరం వాటిని ట్రేల్లో వేసి బేకింగ్ చేశాడు. ఆ తర్వాత దానిని అందంగా ప్యాక్ చేశాడు. ఆ మొత్తం ప్రక్రియలో అపరిశుభ్రత రాజ్యమేలింది.

ఆ వ్యక్తి తన చేతికి అంటిన కేక్ మిశ్రమాన్ని తీయడం చూస్తే అసహ్యం వేయడం ఖాయం. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 1.2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది చాలా మురికిగా ఉంది``, ``ఇలాంటివి తినడం వల్లే భారతీయుల ఇమ్యూనిటీ పెరుగుతోంది``, ``ఇది తింటే అనారోగ్యం ఖాయం`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 08:18 PM