Share News

Watch Video: ఇలాంటి టీచర్ ఉంటే కెమిస్ట్రీ కూడా ఈజీయే.. కరీనా కపూర్‌తో పోల్చుతూ పాఠాలు ఎలా చెబుతున్నాడో చూడండి..

ABN , Publish Date - Feb 06 , 2024 | 06:41 PM

కెమిస్ట్రీలోని మూలకాల సాంకేతిక నామాలను, ఫార్ములాలను గుర్తుంచుకోవడం అంత సులభం కాదు. ఎంత బట్టీ పట్టినా గుర్తుండవు. అందుకే ఓ టీచర్ వెరైటీగా బోధిస్తున్నాడు.

Watch Video: ఇలాంటి టీచర్ ఉంటే కెమిస్ట్రీ కూడా ఈజీయే.. కరీనా కపూర్‌తో పోల్చుతూ పాఠాలు ఎలా చెబుతున్నాడో చూడండి..

మీకు బాగా కష్టమైన సబ్జెక్ట్ ఏంటి అని అడిగితే.. చాలా మంది విద్యార్థులు చెప్పే సమాధానం.. కెమిస్ట్రీ (Chemistry) అనే. కెమిస్ట్రీలోని మూలకాల సాంకేతిక నామాలను, ఫార్ములాలను గుర్తుంచుకోవడం అంత సులభం కాదు. ఎంత బట్టీ పట్టినా గుర్తుండవు. అందుకే ఓ టీచర్ (Teacher) ఓ ప్రత్యేక విధానం ద్వారా బోధిస్తూ విద్యార్థులకు గుర్తుండిపోయేలా చేస్తున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఓ పాట రూపంలో మూలకాల సాంకేతిక నామాలను పిల్లలకు నేర్పుతున్నాడు.

ఆ పాటలో కరీనా కపూర్‌ (Kareena Kapoor)తో పాటు పలు కార్ల పేర్లు కూడా ఉన్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. kelvininstituteiit అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ టీచర్ క్లాస్‌రూమ్‌లోని బ్లాక్‌బోర్డ్‌పై వరుసగా మూలకాల పేర్లను రాశాడు. వరుస క్రమంలో ఉన్న ఆ మూలకాల నామాల ఆధారంగా ``kareena ne kaar maangee auto jen pharaaree, phir bhee hai kyon milee silvar odee gaadee`` అంటూ పాట రూపంలో నేర్పుతున్నాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా వీక్షించారు. 6 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఇలా నేర్పితే నేను కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించేవాడిని``, ``ఆ టీచర్ మంచి పద్ధతి కనిపెట్టాడు``, ``ఆ పాట బాగుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 06:41 PM