Share News

Viral Video: బాబోయ్.. ఏందయ్యా ఈ దారుణం.. డొమినోస్ పిజ్జా తయారుచేసే ఓ ఉద్యోగి ఏం చేశాడో మీరే చూడండే!

ABN , Publish Date - Feb 16 , 2024 | 04:17 PM

డొమినోస్ లో పనిచేసే ఓ ఉద్యోగి చేసిన పనికి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.

Viral Video: బాబోయ్.. ఏందయ్యా ఈ దారుణం.. డొమినోస్ పిజ్జా తయారుచేసే ఓ ఉద్యోగి ఏం చేశాడో మీరే చూడండే!

పిజ్జా చాలామందికి ఇష్టం. ఈ విదేశీ ఫుడ్ ను భారతీయులు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిజ్జా తయారీలో డొమినోస్ కు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అయితే డొమినోస్ లో పనిచేసే ఓ ఉద్యోగి చేసిన పనికి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. పిజ్జా తయారుచేయడానికి పిండి కలుపుతున్న అతను చేసిన పని చూసి నెటిజన్లు కన్నెర్ర చేస్తున్నారు. ఈ వీడియో గురించి పూర్తీగా వివరాల్లోకి వెళితే..

ప్రపంచ వ్యాప్తంగా పిజ్జా లవర్స్ చాలా మంది ఉన్నారు. పిజ్జా తినే ప్రతి ఒక్కరికీ డొమినోస్ గురించి కూడా తెలిసే ఉంటుంది. అయితే జపాన్ లో ఓ పిజ్జా అవుట్ లెట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో పిజ్జా తయరుచేసే ఉద్యోగి పిజ్జా తయారుచేయడానికి పిండి కలుపుతూ కనిపిస్తాడు. పిండి కలుపుతున్న వ్యక్తి ఉన్నట్టుండి తన ముక్కులో వేలు పెట్టి పిజ్జా పిండిలో వేలు తుడుచుకున్నాడు. ఇలా చేసిన తరువాత పిండి కలుపుతున్న వ్యక్తి, వీడియో తీస్తున్న వ్యక్తి ఇద్దరూ గట్టిగా నవ్వుతారు.

ఇది కూడా చదవండి: ఎప్పుడూ టెన్షన్ గా అనిపిస్తూ ఉంటుందా? ఈ 9 అలవాట్లు వదిలేయండి చాలు..!


ఈ వీడియోను Jeffrey J.Hall అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. జపాన్ లోని డొమినోస్ కంపెనీ ఈ సంఘటన తరువాత అందరికీ క్షమాపణ చెప్పిందంటూ క్యాప్షన్ మెన్షన్ చేశారు. కాగా ఈ సంఘటన తరువాత జపాన్ లోని డొమినోస్ ఔట్ లెట్ ను క్లోజ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. "రెస్టారెంట్లు ఏవైనా సరే 100శాతం శుభ్రంగా ఉండవని నాకు తెలుసు" అంటూ ఒకరు ఇలాంటివి చాలాచోట్ల బయటకు కనిపించవనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. "అతను వీడియో తీసి ఎందుకు అప్లోడ్ చేశాడో అర్థం కావడం లేదు" అంటూ మరొకరు కామెంట్ చేశారు. "డొమినోస్ కార్పోరేషన్ కు ఈ సంఘటన గురించి కాల్ చేస్తే వారు ఉచిత పిజ్జా కూపన్ ఇస్తామంటున్నారు" అంటూ ఇంకొకరు కంపెనీలు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయో చెప్పారు.

ఇది కూడా చదవండి: Viral Video: పిల్లలతో అడవికి వెళ్లి ఇవేం పనులయ్యా బాబూ.. ఈ టూరిస్ట్ లు ఏం చేశారో మీరే చూడండి!


మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2024 | 04:17 PM