Tilted Brush Stroke

ఎప్పుడూ టెన్షన్ గా అనిపిస్తూ ఉంటుందా? ఈ 9 అలవాట్లు వదిలేయండి చాలు..!

సామర్థ్యానికి మించి ఎక్కువ పని చేస్తే అలసిపోతారు. అది ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాదు విశ్రాంతి లేకుండా చేస్తుంది. కంగారు పెంచుతుంది.

మొహమాటం కొద్దీ అన్ని పనులకు ఓకే చెప్పడం కాదు.. చేయలేని పనులకు నో చెప్పాలి. లేకపోతే టెన్షన్ భరించాల్సి ఉంటుంది.

వాయిదా వేసే పద్దతి మానేయాలి. పనులు వాయిదా వేయడం వల్ల ఆలస్యం అవుతాయి. పనుల రద్దీ టెన్షన్ పెంచుతుంది.

నెగిటివ్ గా మాట్లాడేవారికి దూరంగా ఉండాలి. నెగిటివ్ గా మాట్లాడేవారితో ఉంటే ఒత్తిడి, టెన్షన్ ఎక్కువ అవుతాయి.

ఎవరి గుంరిచి వారు ఆలోచిస్తే వారికి విలువ పెరుగుతుంది. ఎప్పుడూ ఇతరుల కోసం పనిచేస్తూ మీ పనులు వాయిదా వేసుకోకూడదు. ఇది ఒత్తిడికి దారితీస్తుంది.

అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉండటాన్ని మానుకోవాలి. మీకోసం మీరూ సమయం కేటాయించుకోవాలి.

వ్యాయామం చేస్తే ఎండార్పిన్లు విడుదల అవుతాయి. ఇది మంచి అనుభూతిని పెంచుతుంది.

రోజూ కొద్దిసేపు సూర్యకాంతిలో గడపడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరానికి విటమిన్-డి లభిస్తుంది.

వేపుళ్లు, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. ఇవి మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.