Share News

Viral: తన ప్రైవేట్ పార్ట్‌ను తానే కోసేసుకున్న పూజారీ.. కారణం తెలిస్తే షాకే..

ABN , Publish Date - Jan 05 , 2024 | 02:04 PM

కొందరు పొరపాటుగానో.. కోపంలోనే చేతులు కాళ్లు కోసేసుకున్న సందర్భాలు మనం చాలానే చూశాం. కానీ, తన ప్రైవేట్ పార్ట్‌ను తానే కోసేసుకున్న ఘటనను ఎక్కడైనా చూశారా? అంత సాహసం ఎవరూ చేయరు. కానీ, ఇక్కడ ఓ పూజారి తన పురుషాంగాన్ని తానే కోసేసుకున్నాడు. కత్తి తీసుకుని ప్రైవేట్ పార్ట్‌ను కట్ చేసుకున్నాడు.

Viral: తన ప్రైవేట్ పార్ట్‌ను తానే కోసేసుకున్న పూజారీ.. కారణం తెలిస్తే షాకే..
representative image

Viral News: కొందరు పొరపాటుగానో.. కోపంలోనే చేతులు కాళ్లు కోసేసుకున్న సందర్భాలు మనం చాలానే చూశాం. కానీ, తన ప్రైవేట్ పార్ట్‌ను తానే కోసేసుకున్న ఘటనను ఎక్కడైనా చూశారా? అంత సాహసం ఎవరూ చేయరు. కానీ, ఇక్కడ ఓ పూజారి తన పురుషాంగాన్ని తానే కోసేసుకున్నాడు. కత్తి తీసుకుని ప్రైవేట్ పార్ట్‌ను కట్ చేసుకున్నాడు. దాంతో తీవ్ర రక్తస్రావంతో కోమాలోకి వెళ్లాడు. ఈ ఘటన దక్షిణ బొహెమియాలోని సెస్కోబుడెజోవిక్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఒక పూజారి సైక్రియాటిక్ సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే, అతను ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా వెళ్లలేదు. దాంతో ఆ కార్యక్రమ నిర్వాహకులు ఏం జరిగిందో తెలుసుకునేందుకు నేరుగా అతని ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అతను పురుషాంగం తెగిపోయి, రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతన్ని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ గాయం కారణంగా పూజారి కోమాలోకి వెళ్లాడు. 10 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందినప్పటికీ.. కోమా నుంచి బయటకు రాలేదు. అసలేం జరిగిందో తెలియక వైద్యులు, విచారణాధికారులు తలపట్టుకున్నారు. కానీ, చివరకు ఈ ఘటనకు కారణం ఏంటో కనిపెట్టారు.

సదరు పూజారి టిక్-బోర్న్ ఎన్సెఫాలిటిస్‌తో బాధపడుతున్నాడు. దీనిని సంక్షిప్తంగా టీబీఈ అని కూడా పిలుస్తారు. ఇది టిక్-ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ వల్ల కలిగే మెదడు వాపు అని చెబుతున్నారు నిపుణులు. దీని వల్ల వ్యక్తిత్వ మార్పులు చోటు చేసుకోవడమే కాకుండా.. సైకోసిస్‌ను కూడా ప్రేరేపిస్తుంది. ఈ క్రమంలోనే.. పూజా సైకలాజికల్ సమస్యతో తన పురుషాంగాన్ని తానే కోసుకున్నట్లు ధృవీకరించారు వైద్యులు, విచారణాధికారులు.

Updated Date - Jan 05 , 2024 | 02:04 PM