Share News

Viral: వామ్మో.. బస్సులో రెస్టారెంట్.. ఇదేం ఐడియారా బాబూ!

ABN , Publish Date - May 21 , 2024 | 08:25 PM

రెస్టారెంట్ కు అనుకూలంగా ఓ బస్సు సిద్ధం చేసిన వైనం నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Viral: వామ్మో..  బస్సులో రెస్టారెంట్.. ఇదేం ఐడియారా బాబూ!
Restaurant on Wheels

ఇంటర్నెట్ డెస్క్: నచ్చిన ఆహారం తినాలంటే మనందరం ఏ హోటల్‌కో రెస్టారెంట్‌కో వెళుతుంటాం. వాటిల్లోని ఆహ్లాదకరమైన వాతావరణంలో నచ్చిన ఫుడ్ లొట్టలేసుకుంటూ తింటాం. ప్రస్తుతం మనకు నచ్చిన ఆహారాన్ని సర్వ్ చేసే ఫుడ్ ట్రక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ కూర్చోవడానికి సరైన స్థలం ఉండదు కానీ ఫుడ్ మాత్రం యమా రుచిగా ఉంటుంది. రెంటు వంటి సమస్యలు లేకపోవడంతో నిర్వాహకులకు కూడా ఫుడ్ ట్రక్ ద్వారా మంచి లాభాలు వస్తుంటాయి. అయితే, ఇదే ఐడియాను కొనసాగిస్తూ కొందరు ఏకంగా ఫుడ్ బస్‌ను ఏర్పాటు చేశారు. ఈ వీడియో (Viral) జనాలను విపరీతంగా షేక్ చేస్తోంది.

Viral: చావు ముంగిట వ్యూహం మార్చిన పాము.. ఊపిరాడక గెద్ద ఉక్కిరిబిక్కిరి..షాకింగ్ వీడియో


చిన్న చిన్న చక్రాలు ఉండి చూడటానికి బస్సు సైజులో ఈ వాహనాన్ని నిర్మించారు. ఇందులో వంట సామగ్రితో పాటు టేబుళ్లు కూడా పెట్టుకునేంత స్థలం ఉంది. లోపల సకల సౌకర్యాలు అమర్చుకునేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశారు. అయితే, ఈ బస్సును ఎక్కడైనా నిలుపుతారా లేక బస్సులో వెళుతూ తినాలనే వెరైటీ కాన్సెప్ట్ ను పరిచయం చేస్తారో మాత్రం ఇంకా తెలియరాలేదు. వీడియోలోని బస్సులో ఇంకా పూర్తి ఏర్పాట్లు చేయలేదు (Video of Restaurant bus going viral on social media).

ఇక వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ బస్సు నిజంగా రెస్టారెంట్ ఏర్పాటుకు ఊపయోగపడుతుందా అని అనేక మంది సందేహం వ్యక్తం చేశారు. దీన్ని సాధారణ వీధుల్లో, ఫుట్ పాత్ ల మీద నిలపలేమని కొందరు అన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్ మీద నుంచి వెళితే లొపలున్న వారికి చుక్కలు కనిపిస్తాయని కొందరు కామెంట్ చేశారు. ఇందులో రెస్టారెంట్ ఎలా నిర్వహిస్తారో జనాలకు మాత్రం అర్థం కాకపోవడంతో విభిన్న రకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Read Viral and Telugu News

Updated Date - May 21 , 2024 | 08:32 PM