Share News

Viral Video: పిచ్చికి కూడా ఓ హద్దుండాలి భయ్యా! ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ డేటింగ్.. షాకింగ్ వీడియో వైరల్!

ABN , Publish Date - May 06 , 2024 | 02:46 PM

అమ్మాయిలను డేటింగ్‌కు తీసుకెళ్లేటపుడు ఎవరైన మంచి రొమాంటిక్ ప్లేస్‌ను ఎంచుకుంటారు. మంచి రెస్టారెంట్‌కో, పార్క్‌కో తీసుకెళతారు. ఎలాంటి రిస్క్ లేకుండా హాయిగా గడిచిపోవాలని కోరుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలనే కాదు.. తన ప్రేయసి ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టి ఓ వెరైటీ డేట్ ప్లాన్ చేశాడు.

Viral Video: పిచ్చికి కూడా ఓ హద్దుండాలి భయ్యా! ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ డేటింగ్.. షాకింగ్ వీడియో వైరల్!
Dating

అమ్మాయిలను డేటింగ్‌కు (Dating) తీసుకెళ్లేటపుడు ఎవరైన మంచి రొమాంటిక్ ప్లేస్‌ను ఎంచుకుంటారు. మంచి రెస్టారెంట్‌కో, పార్క్‌కో తీసుకెళతారు. ఎలాంటి రిస్క్ లేకుండా హాయిగా గడిచిపోవాలని కోరుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలనే కాదు.. తన ప్రేయసి ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టి ఓ వెరైటీ డేట్ ప్లాన్ చేశాడు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాహసోపేతమైన డేటింగ్‌కు తీసుకెళ్లాడు. వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే ఎవరికైనా భయం వేయక మానదు (Viral Video).


tobot_travel అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి, యువకుడు డిన్నర్ టేబుల్‌తో సహా గాల్లో ప్రయాణించారు. రెండు కొండల మధ్య కట్టిన కేబుల్ వైర్‌కు వేలాడుతూ వారు అత్యంత సాహసోపేతంగా భోజనం చేశారు. ఈ వీడియో చూడడానికే చాలా భయంకరంగా ఉంది. ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 2.5 కోట్ల మందికి పైగా వీక్షించారు. 42 లక్షల మందికి పైగా లైక్ చేశారు.


ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది సూసైడ్ మిషన్‌లాంటిది``, ``తేడా వస్తే ఇదే చివరి భోజనం అవుతుంది``, ``వీళ్లు నిజంగా మూర్ఖులు``, ``ఇది ప్రాణాలతో చెలగాటం``, ``ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కోతిని చూసి టేబుల్ మేనర్స్ నేర్చుకోవాలి.. కుర్చీలో కూర్చుని ఎలా తింటోందో చూడండి.. వీడియో వైరల్!


Viral Video: ఇరాన్‌లో చేపల వర్షం.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.. దీని వెనుకున్న కారణమేంటి?


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2024 | 02:46 PM