Share News

Viral: భవనంలోంచి దూసుకుపోయిన రైలు! గ్రాఫిక్స్‌ను మించిన సీన్!

ABN , Publish Date - Jul 09 , 2024 | 09:43 PM

భవంతిలోనుంచి రైలు వెళ్లేలా ట్రాక్ నిర్మించిన చైనా ఇంజినీర్లపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Viral: భవనంలోంచి దూసుకుపోయిన రైలు! గ్రాఫిక్స్‌ను మించిన సీన్!

ఇంటర్నెట్ డెస్క్: నానాటికీ జనాభా పెరుగుతున్న కొద్దీ కొత్త నిర్మాణాలు చేపట్టడం ఇంజినీర్లకు కత్తిమీద సాములా మారింది. అనేక నగరాల్లో సరైనా జాగాలు దొరక్క ఇంజినీర్లు తమ నిర్మాణాల కోసం సృజనాత్మక మార్పులతో ముందుకొస్తున్నారు. చైనాలో ఇలాంటి తీరు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

Viral: 35 రోజుల వ్యవధిలో యువకుడికి 6 సార్లు పాము కాటు.. చివరకు ఏమైందంటే..

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ రైలు ఏకంగా 19 అంతస్తుల భవంతి లోపలి నుంచి ప్రయాణించింది. గ్రాఫిక్స్‌కు మించిపోయినట్టు ఉన్న ఈ దృశ్యం ఛాంగ్‌కింగ్ లిజ్బా ప్రాంతంలోనిది. వీడియోకు జత చేసిన క్యాప్షన్ ప్రకారం, ఆ నగరంలో అనేక ఆకాశహ్మ్యాలు ఉన్నాయి. నగరంలో కొత్త రైల్వే లైను ఏర్పాటు చేద్దామనుకున్నారు. చాలా చోట్లు భవంతుల పక్క నుంచి ట్రాక్ వేశారు. ఓ భవంతి వద్ద అలాంటి అవకాశం లేకపోయింది. అందులో వందల మంది నివసిస్తుండటంతో వారిని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి ఇష్టం లేకపోయింది. చివరకు భవంతిలోంచి రైలు వెళ్లేలా ట్రాక్ నిర్మించారు. అంతేకాదు భవంతిలోనే ఓ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు (Train Passes Through A 19-storeyed Residential Building In China).


చైనా ఇంజినీర్ల టాలెంట్ చేసి జనాలు షాకైపోతున్నారు. ఓ భవంతి లోంచి రైలు వెళ్లగలదని ఎప్పుడైనా ఊహించామా అని ఓ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. భవంతిలోని వారికి శబ్ద కాలుష్యం ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాటు చేయడంపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 10:08 PM