Share News

Viral Video: ఈ వెరైటీ సెలూన్‌ను చూశారా? ఈ సెలూన్‌కు వెళ్లాలంటే నీటిలో తడవాల్సిందే..

ABN , Publish Date - Jan 14 , 2024 | 04:52 PM

గతంలో జుత్తు కత్తిరించుకోవాలంటే క్షురకుడు ఇంటికే వచ్చి కట్ చేసి వెళ్లిపోయేవాడు. ఆ తర్వాత బార్బర్ షాప్‌లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఖరీదైన సెలూన్‌లు మొదలయ్యాయి. కస్టమర్లకు విభిన్న అనుభూతిని కలిగించేందుకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Viral Video: ఈ వెరైటీ సెలూన్‌ను చూశారా? ఈ సెలూన్‌కు వెళ్లాలంటే నీటిలో తడవాల్సిందే..

గతంలో జుత్తు కత్తిరించుకోవాలంటే క్షురకుడు (Barber) ఇంటికే వచ్చి కట్ చేసి వెళ్లిపోయేవాడు. ఆ తర్వాత బార్బర్ షాప్‌లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఖరీదైన సెలూన్‌లు (Salon) మొదలయ్యాయి. కస్టమర్లకు విభిన్న అనుభూతిని కలిగించేందుకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాజాగా వాటర్ థీమ్‌తో ఉన్న సెలూన్ (Water Salon) చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఇండోనేషియాలోని అచేలో ఈ సెలూన్‌ను ఏర్పాటు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).

radenthebarber అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని సెలూన్‌ను పూర్తిగా నీటితో నింపేశారు. బార్బర్లు మోకాలు లోతు నీటిలో నిల్చుని కస్టమర్లకు కటింగ్ చేస్తున్నారు. ఖాళీగా ఉండే కస్టమర్లు ఆ నీటిలో చేపలు కూడా పడుతున్నారు. కస్టమర్లు కూడా నీటిలో తడుచుకుంటూ లోపలకు రావాల్సి ఉంటుంది. ఈ వాటర్ థీమ్ సెలూన్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోను కేవలం నాలుగు రోజుల్లోనే 10 లక్షల మందికి పైగా వీక్షించారు. రెండు లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఏ ఎలక్ట్రిక్ వైర్ కింద పడినా చాలా ప్రమాదం``, ``దీని వల్ల ఉపయోగం ఏంటి``, ``వెరైటీ ఆలోచన`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Jan 14 , 2024 | 04:52 PM