Share News

Viral: రోజూ అదే ట్రెయిన్ కోసం ప్లాట్‌ఫామ్‌పై వేచి చూసే కుక్క.. అసలు కథేంటో తెలిస్తే..

ABN , Publish Date - May 03 , 2024 | 04:50 PM

తనకు ఆహారం తీసుకొచ్చే ట్రెయిన్ డ్రైవర్ కోసం ఓ కుక్క ప్రతి రోజూ రైల్వే స్టేషన్‌లో వేచి చూడటం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Viral: రోజూ అదే ట్రెయిన్ కోసం ప్లాట్‌ఫామ్‌పై వేచి చూసే కుక్క.. అసలు కథేంటో తెలిస్తే..
Train locopilot feeding stray dog

ఇంటర్నెట్ డెస్క్: మనిషి పట్ల నిజమైన విశ్వాసం ప్రదర్శించే ఒకేఒక జంతువు కుక్క. పట్టెడన్నం పెడితే చాలు అది జీవితాంతం వెంటే ఉంటుంది. మనిషి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను అడ్డేసేందుకూ వెనకాడదు. అందుకే ప్రస్తుతం ఓ శునకం ఉదంతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ప్రతి రోజూ రైల్వే స్టేషన్ వద్ద ఓ ట్రెయిన్ కోసం ఎదురు చూసే కుక్క ఆసక్తికర ఉదంతం ఇది.

Hakan Kapucu అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను నెట్టింట షేర్ చేశాడు. ఈ యూజర్ చెప్పిన వివరాల ప్రకారం, ఓ కుక్కకు ట్రెయిన్ డ్రైవర్ ఓ స్టేషన్‌కు వచ్చిన ప్రతిసారీ ఆహారం పెట్టడం ప్రారంభించాడు. దీంతో, కుక్కకు ఆ ట్రెయిన్ డ్రైవర్‌పై విశ్వాసం ఏర్పడింది. ఇక ఆ తరువాత నుంచీ అది రోజూ ఆ స్టేషన్‌లో ట్రెయిన్ డ్రైవర్ కోసం వేచి చూడటం ప్రారంభించింది.

Viral: తన గదిలో దెయ్యాలు ఉన్నాయని బాలిక గోలపెడుతున్నా తల్లిదండ్రులు పట్టించుకోలేదు! చివరకు..


ట్రెయిన్‌ను, అందులోని డ్రైవర్‌ను గుర్తుపట్టగానే ప్లాట్‌ఫాం రైలును అనుసరిస్తూ పరిగెడుతుంది. రైలు ఆగగానే ఇంజన్ వద్దకు చేరుకుంటుంది. ఈలోపు రైలు డ్రైవర్ ట్రెయిన్ దిగి కుక్కకు ఓ ప్లేట్‌లో ఆహారం పెడతాడు. నిత్యం జరిగే ఈ సీన్ ఓ రోజూ ఆ డ్రైవర్ వీడియోలో బంధించడం, అది నెట్టింట బాట పట్టి వైరల్ కావడంతో జనాలకూ ఈ విషయం గురించి తెలిసింది(The delightful story behind this stray dogs friendship with a train driver) .

ఇక వీడియో చూసిన అనేక మంది డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వం చాటుకున్నాడంటూ తెగ పొడిగేస్తున్నారు. వీధుల్లో ఉన్న కుక్కలను మానవతా మూర్తులు చేరదీసి పెంచుకుంటే వీధి కుక్కల బెడద కూడా తీరిపోతుందని కొందరు చెప్పారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Viral and Telugu News

Updated Date - May 03 , 2024 | 07:21 PM