Share News

Summer Tips: ఇంట్లో ఏసి, కూలర్ ను తలదన్నే చల్లదనం కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి చూడండి..!

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:19 PM

వేసవిలో రోజంతా ఫ్యాన్, ఏసిలు, కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఇవి ఎక్కువ పనిచేయడం వల్ల విద్యుత్ బిల్లు తడిసి మోపెడవుతుంది. విద్యుత్ బిల్లు భయం లేకుండా.. ఏసి, కూలర్ అవసరం లేకుండానే ఇల్లంతా చల్లగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

Summer Tips:  ఇంట్లో ఏసి, కూలర్ ను తలదన్నే చల్లదనం కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి చూడండి..!

వేసవికాలం విశ్వరూపం చూపిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. ఇంటి గోడల వేడి కాస్తా ఇంట్లోకి ప్రసరించి ఇల్లంతా వేడిగా మార్చేస్తుంది. ఈ కారణంగానే వేసవిలో రోజంతా ఫ్యాన్, ఏసిలు, కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఇవి ఎక్కువ పనిచేయడం వల్ల విద్యుత్ బిల్లు తడిసి మోపెడవుతుంది. విద్యుత్ బిల్లు భయం లేకుండా.. ఏసి, కూలర్ అవసరం లేకుండానే ఇల్లంతా చల్లగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే..

ఇంటి కిటికిలపై మందంపాటి కర్టెన్లు లేదా బ్లైండ్లను ఉంచాలి. ఈ టిప్ వల్ల సూర్యకిరణాలు నేరుగా ఇంట్లోకి ప్రసరించవు. ఇంట్లో ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. వేడి నుండి ఉపశమం ఉంటుంది.

వేసవిలో టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు..!


ఇంట్లో క్రాస్ వెంటిలేషన్లు ఉండటం చాలా ముఖ్యం. దీంతో ఇల్లు చల్లగా ఉంటుంది. ఇంట్లోకి స్వచ్చమైన గాలి కూడా ప్రసరిస్తుంది.

వేసవి వేడి నివారించడానికి మరొక మంచి చిట్కా ఇండోర్ మొక్కలు పెంచడం. దీనివల్ల ఇల్లు చల్లగా ఉంటుంది. ఈ మొక్కలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

ఇంట్లో వేడి నివారించడానికి ఇంట్లో లేత రంగు ఉన్న కర్టెన్లను ఉపయోగించాలి. ఇది వేడి నుండి ఉపశమనం పొందడానికి మంచి మార్గం.

30ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవలసిన 10 విటమిన్ల లిస్ట్ ఇదీ..!


ఇంట్లో ఎక్కువ వెలుతురు ఉండే బల్బులు ఉంటే వాటి స్థానంలో సిఎఫ్ఎల్, లెడ్ బల్బులను అమర్చుకోవాలి. ఇవి గదిని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. ఎక్కువ వెలుతురు ఇచ్చే బల్బులు ఇంటిని వేడిగా మారుస్తాయి.

ఏసి, కూలర్ తో పనిలేకుండా ఇల్లంతా చల్లగా ఉండాలంటే ఈజీ చిట్కా ఉంది. ఒక బౌల్ లో మంచు ముక్కలు వేసి దాన్ని ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ముందు ఉంచాలి. ఇలా చేస్తే గది అంతా చల్లగా ఉంటుంది.

30ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవలసిన 10 విటమిన్ల లిస్ట్ ఇదీ..!

వేసవిలో టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 04:19 PM