Viral: అబ్బాయిలు తన్నుకుంటున్నారని బాలికల పిర్యాదు! టీచర్ వెళ్లి చూస్తే..
ABN , Publish Date - Jul 15 , 2024 | 10:17 PM
స్కూలు చదువులు ముగుస్తున్న నేపథ్యంలో కొందరు విద్యార్థులు తమ ఫేవరెట్ టీచర్‌కు ఇచ్చిన సర్‌ప్రైజ్ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి స్మార్ట్ ఫోన్ల జమానాలో మధురమైన క్షణాల్ని కెమెరాలో బంధించి శాశ్వతం చేసుకోవడం సాధారణంగా మారింది. అంతేకాకుండా, ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో పంచుకుంటారు కాబట్టి వీలైనంత వినూత్నంగా జరుపుకోవాలని కోరుకుంటారు. ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా సరిగ్గా ఇదే ఆలోచించారు. స్కూలు రోజులు ముగిసిపోతున్న నేపథ్యంలో తమ ఉపాధ్యాయురాలికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీని తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: విమానంలో టీ ఒలకడంతో గాయాలు! రూ.12 కోట్ల పరిహారం కోరుతూ కేసు!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తొలుత కొందరు బాలికలు స్టాఫ్ రూంలోకి వెళ్లి అబ్బాయిలు క్లాస్‌లోనే తన్నుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో, కంగారు పడ్డ టీచర్.. వడివడిగా నడుచుకుంటూ క్లాస్ రూంవైపు వెళ్లారు. ఆమె వెంటే విద్యార్థినులు కూడా వెళ్లారు. క్లాస్‌లోకి వెళ్లగానే కనిపించిన దృశ్యం చూసి టీచర్ షాకైపోయారు. ఇద్దరు విద్యార్థులు కాలర్లు పట్టుకుని రెచ్చిపోతుంటే చుట్టూ ఉన్న ఇతర విద్యార్థులు గోలగోల చేశారు. టీచర్ కంగారుగా వాళ్లను ఆపే ప్రయత్నం చేయగా స్టూడెంట్స్ ఒక్కసారిగా గొడవ ఆపేసి ఆమెకు జేజేలు పలుకుతూ కేక్ ఆమె ముందుంచారు. దీంతో, టీచర్ ఆశ్చర్యపోయిన విద్యార్థుల అభిమానం చూసి మురిసిపోయింది (Students surprise teacher by staging fight scene in their final days at school).
వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు విద్యార్థుల క్రియేటివిటీ బాగుందని ప్రశంసలు కురిపించారు. టీచర్‌ను సర్‌ప్రైజ్ చేసేందుకు వారు ఇంత ఆలోచన చేశారంటే వారికి గురుపై ప్రేమాభిమానాలు మెండుగా ఉందని అన్నారు. ఇలాంటి విద్యార్థులను పొందిన టీచర్ కూడా అదృష్టవంతురాలేనని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.