Share News

Viral: యువతులకు మర్చిపోలేని గుణపాఠం చెప్పిన కుక్క.. చూసి తీరాల్సిన వీడియో ఇది!

ABN , Publish Date - Mar 29 , 2024 | 05:11 PM

షార్ట్ వీడియోల మోజులో పడ్డ యువతకు ఓ కుక్క ఇచ్చిన ఝలక్ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: యువతులకు మర్చిపోలేని గుణపాఠం చెప్పిన కుక్క.. చూసి తీరాల్సిన వీడియో ఇది!

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య యువతకు షార్ట్ వీడియోల వ్యసనం పట్టుకున్న విషయం తెలిసిందే. ఎక్కడ పడితే అక్కడ, సమయం సందర్భం చూడకుండా యువత షార్ట్ వీడియోలు షూట్ చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. వీరి తీరు వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నా యువతలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించట్లేదు. అలాంటి ఓ యువ బ్యాచ్‌కు కుక్క ఇచ్చిన ఝలక్ చూసి జనాలు పడీ పడీ నవ్వుకుంటున్నారు. షార్ట్ వీడియో బ్యాచ్‌లకు సరైన గుణపాఠం చెప్పిందీ కుక్క అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ (Viral) అవుతోంది.

థియేటర్‌లో సినిమా చూస్తున్న మహిళ.. ముందు సీట్లోని వ్యక్తి చిమ్మ చీకట్లో చేస్తున్నదేంటో చూసి..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు యువతులు షార్ట్ వీడియో కోసమని నడి వీధిలో డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఆ పక్కనే ఉన్న ఓ కుక్కకు ఇదంతా గమనించాక ఏమనిపించిందో గానీ ఒక్కసారిగా వైపు పరిగెత్తింది. మొరుగుతూ వస్తున్న కుక్కను చూసి భయపడిపోయిన యువతులు అక్కడి నుంచి పారిపోయారు. చివరకు కెమెరాలో కుక్క మాత్రమే కనిపించింది.

Viral Video: కెనడాలో మరీ ఇంత దారుణమా.. డబ్బులు చాలక పిజ్జా డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తుంటే..


వీడియోలో ఇదంతా చూసి నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు. షార్టీ వీడియోల పేరిట రెచ్చిపోతున్న యువతీయువకులు ఇలాంటి గుణపాఠమే కావాలని వ్యాఖ్యానించారు. మెట్రోలు, రైళ్లల్లో ఇలాంటి కుక్కలు కాపలా కాస్తే షార్ట్ వీడియోల బెడద తగ్గిపోతుందని సెటైర్లు పేల్చారు. కుక్కకు డ్యాన్స్ నచ్చక చిరాకు వచ్చిందేమో అంటూ మరికొందరు కామెంట్ చేశారు. కాగా, జనాలకు ఈ వీడియో విపరీతంగా నచ్చడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ 40 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Spit Stains: ఈ మహిళ కష్టం చూసాకైన జనాల్లో మార్పొస్తుందా? నెటిజన్లను కలచివేస్తున్న వీడియో!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 05:21 PM