Share News

Viral: మానవత్వం అంటే ఇదే.. వరదలకు అతాకులతమైన దుబాయ్‌లో అద్భుత దృశ్యం

ABN , Publish Date - Apr 18 , 2024 | 08:53 PM

దుబాయ్ వరదల్లో చిక్కుకుపోయిన ఓ పిల్లిని కాపాడిన అత్యవసర సిబ్బందిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

Viral: మానవత్వం అంటే ఇదే.. వరదలకు అతాకులతమైన దుబాయ్‌లో అద్భుత దృశ్యం

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల అకాల వర్షాలు దుబాయ్‌ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అన్ని రకాల సౌకర్యాలు, రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉన్న మనషులు వర్షం బీభత్సానికి నానా అవస్థలూ పడ్డారు. ఇక జంతువుల సంగతి సరేసరి. వర్షాలు, వరదలకు మూగ జీవాలు ప్రాణాలు కాపాడుకునేందుకు పడిన కష్టాల వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నేటిజన్లతో కన్నీళ్లు పెట్టించాయి. అయితే, అక్కడి అత్యవసర సిబ్బందితో పాటు సామాన్యులు కూడా తమకు చేతనైన మేర మూగజీవాలను కాపాడే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.

IndiGo: ‘ఇండిగో’ ఉప్మాపై హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్ కీలక కామెంట్స్.. వెంటనే స్పందించిన ఎయిర్ లైన్స్!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ పిల్లి వరదల కారణంగా ఎటూ వెళ్లలేక కారు డోరు హ్యాండిల్‌కు వేళాడుతూ కనిపించింది. అలా ఎంత సేపటిని నుంచీ ఉందో తెలీదు గానీ అది నీటిలో తడిసి ముద్దైపోయింది. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు పాకులాడుతోంది. దీన్ని చూసిన వెంటనే ఓ వ్యక్తి దాని కాపాడాడు. రోడ్డంతా సంద్రాన్ని తలపిస్తుండటంతో అతడు బోటులో ప్రయాణిస్తూ కారు వద్దకు వచ్చిన పిల్లి తీసి తన బోటులో పెట్టాడు. తొలుత కారు డోర్ వదిలేందుకు భయపడ్డ పిల్లి తనను రక్షిస్తున్నారన్న విషయాన్ని అర్థం చేసుకుని డోర్ వదిలిపెట్టింది (Stranded cat clinging to car door amid Dubai flood rescued ).

ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. పిల్లిని కాపాడిన వ్యక్తిపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు అత్యవసర సర్వీసుకు చెందిన వాడని తెలిశాక పొగడ్తలు ఆశాశాన్నంటాయి. ఎలాంటి విపత్తుల్లోనైనా ప్రజలకు కాపాడేందుకు తామున్నామంటూ ముందుకొచ్చే అత్యవసర సిబ్బంది గొప్పదనాన్ని మాటల్లో వర్ణించలేమని అనేక మంది కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 10:03 PM