Stag beetle: ఈ పురుగు ధర అక్షరాల రూ.75 లక్షలు! ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - Jul 07 , 2024 | 04:14 PM
స్టాగ్ బీటిల్ అనే అరుదైన పురుగు ఉన్న వారిని అదృష్టం వరిస్తుందని, రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోతారని నమ్మకం, అందుకే దీని ధర దాదాపు రూ.75 లక్షలు ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: సామాజికంగా మనిషి ఎంత పురోగతి సాధించినా మనుషులు తమ వ్యక్తిగత జీవితాల్లో నిత్యం అనిశ్చితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని నుంచి బయటపడేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తారు. కొన్ని రకాల చిహ్నాలు, వస్తువులు ఇళ్లల్లో ఉంటే అదృష్టం వరిస్తుందని భావించే వారి కోకల్లు. ఇందులో వింతేమీ లేకపోయినప్పటికీ.. ఓ పురుగు అదృష్టానికి కేరాఫ్ గా మారిందంటే ఆశ్చర్యకలగక మానదు. అంతేకాదు, ఈ పురుగుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా మార్కెట్లో వీటిని కొనుగోలు చేయాలంటే ఏకంగా రూ.75 లక్షలు చెల్లించాలి. జనాల్ని ఇంతలా వివశుల్ని చేస్తున్న ఈ పురుగు పేరు స్టాగ్ బీటిల్ (Stag beetle).
Viral: వింత వ్యసనం.. పెట్రోల్ తాగేందుకు అలవాటు పడ్డ మహిళ!
ఇంగ్లిష్‌లో స్టాగ్ అంటే కొమ్ములు అని అర్థం. ఈ పురుగ కోరలు జింక కొమ్ముల్లాగా ఉంటాయని కాబట్టి దీనికి ఆ పేరు స్థిరపడింది. ఈ జాతికి చెందిన మగ పురుగులు మాత్రమే కోరలు ఉంటాయి. మరో విచిత్రం ఏంటంటే ఇది చనిపోయిన చెట్ల కాండాలను, కొమ్మలను తిని బతుకుతుంటాయి. అంతేకాదు, లార్వా దశలో పొందిన శక్తి నిల్వలనే మీదనే ఇవి పెద్దవయ్యాక కూడా ఎక్కువగా ఆధారపడతాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి. చలి ప్రదేశాలు వీటికి అస్సలు పడవు. వీటిల్లో మగ పురుగులు 75 మిల్లీమీటర్ల వరకూ పొడవు, ఆడ పురుగులు 50 మిల్లీ మీటర్ల వరకూ పొడవుంటాయి. గరిష్ఠంగా 6 గ్రాముల బరువు ఉంటాయి. ఇవి అత్యంత అరుదైనవి కావడం, రాత్రికి రాత్రి మిలియనీర్లను చేసేస్తుందన్న నమ్మకం కారణంగా ఈ పురుగు ధర కోటి వరకూ ఉంటుంది. అంటే.. ఓ ఖరీదైన లగ్జరీకారుతో సమానం అన్నమాట.