Viral: మామ చెప్పినట్టు వినలేదు.. అందుకే ఓటమి.. రిషి సునాక్‌పై ట్రోలింగ్
ABN , Publish Date - Jul 05 , 2024 | 08:58 PM
రిషి సునాక్‌పై నెట్టింట ట్రోలింగ్ కొనసాగుతోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాట ప్రకారం వారానికి 70 గంటలు కష్టించి పనిచేయక ఓటమి చవి చూశారని కామెంట్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్రపంచం జాలి లేనిది. ఉన్నట్టుండి అందలాన్ని ఎక్కించి చూస్తుండగానే పాతాళానికి తోసేస్తుంది. లైకులు, షేర్లు, ఫాలోవర్లు ఓవైపు.. ట్రోలింగ్ మరోవైపు వెరసి ఈ ప్రపంచం భయానకం. ఇప్పుడు నెటిజన్ల దృష్టి రిషి సునాక్‌పై పడింది. ఎక్కడెక్కడి వాఖ్యలను తవ్వితీస్తూ రిషిని టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు ఇందుకు సంబంధించి అనేక ట్వీట్లు ప్రస్తుతం వైరల్ (Viral) అవుతున్నాయి.
Viral: వేల కోట్ల ఆస్తి ఉన్నా.. 30 ఏళ్లుగా చీరలు కొనని సుధామూర్తి! ఎందుకంటే..
అప్పుడెప్పుడో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వ్యాఖ్యలను తవ్వితీసిన నెటిజన్లు రిషిపై ట్రోలింగ్ మొదలెట్టారు. యువత వారంలో 70 గంటలు పని చేయాలని నారాయణమూర్తి అన్న వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద చర్చ జరిగిన విషయం తెలిసిందే. నాటి మాటలు గుర్తు చేస్తున్న నెటిజన్లు రిషిపై ట్రోలింగ్‌కు దిగారు. పిల్లనిచ్చిన మామ మాట ప్రకారం వారానికి 70 గంటలు పనిచేయలేదు కాబట్టే ఇప్పుడు బ్రిటన్ ఎన్నికల్లో ఓటమి చవిచూశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. రిషి ఇక ఇండియాకు తిరిగొచ్చి వారానికి 70 గంటల పనిచేస్తారా అని మరో వ్యక్తి ప్రశ్నించాడు. ఇప్పుడు రిషి వారానికి ఎన్నిక గంటలైనా పనిచేసేందుకు సిద్ధమే అని మరొకరు అన్నారు (Ryanair airlines social media jab at UK PM Rishi Sunak goes viral after election defeat ).
మరోవైపు, రిషిపై రయానెయిర్ ఎయిర్ లైన్స్ కూడా సెటైర్ పేల్చింది. ‘‘రిషీ.. ఆందోళన వద్దు.. నీ కోసం మా దగ్గర ఎప్పుడూ ఓ సీటు రెడీగా ఉంటుంది’’ అంటూ రిషి ఓటమిని పరోక్షంగా ప్రస్తావించింది. మరికొందరు మాత్రం రిషి బ్రిటన్‌కు చాలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు అండగా నిలిచారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య రిషి పేరు నేడు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.