Share News

Raw Turmeric: పచ్చిపసుపు ఎప్పుడైనా వాడారా? ఇది చర్మానికి చేసే మ్యాజిక్ ఏంటంటే..!

ABN , Publish Date - Apr 11 , 2024 | 04:54 PM

సాధారణ పసుపు కంటే పచ్చి పసుపు వాడేవారు చాలా తక్కువ. పచ్చిపసుపును చర్మానికి ఉపయోగిస్తే కలిగే మ్యాజిక్ ఇదీ..

Raw Turmeric: పచ్చిపసుపు ఎప్పుడైనా వాడారా?  ఇది చర్మానికి చేసే మ్యాజిక్ ఏంటంటే..!

పసుపు శతాబ్దాల కాలం నుండి వంటల్లోనూ, సౌందర్య సాధనంగానూ, వైద్యంలోనూ ఉపయోగిస్తున్నారు. పసుపును ఫేస్ మాస్క్‌లు, లోషన్లు, స్క్రబ్‌లు, సబ్బుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అయితే సాధారణ పసుపు కంటే పచ్చి పసుపు వాడేవారు చాలా తక్కువ. పచ్చిపసుపును చర్మానికి ఉపయోగిస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

పచ్చి పసుపును కళ్ల కింద నల్లటి వలయాలపై రాసుకుంటే చాలా లాభాలు ఉంటాయి. దీని వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. ఇది చర్మం రంగును కూడా క్లియర్ చేస్తుంది. అయితే పచ్చి పసుపు పేస్ట్‌ను ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచితే అది పసుపు రంగును చర్మం లోపలికి ఇంకేలా చేస్తుంది.

ఇది కూడా చదవండి: వేసవికాలంలో ఈ ఆహారాలను పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకండి!


ముఖంపై ఏదైనా గాయం గుర్తు ఉంటే పచ్చి పసుపు రాసుకోవాలి. ఇది మచ్చను తేలిక చేస్తుంది, గాయం కూడా మానుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది గాయం నయం చేయడంలో సహాయపడుతుంది.

ముఖం మీద మచ్చలు ఎక్కువగా ఉండి వాటితో ఇబ్బంది పడుతుంటే.. వాటిని వదిలించుకోవడానికి ఇంటి చిట్కాగా పచ్చిపసుపును అప్లై చేయవచ్చు. పసుపులో ఉండే సహజ లక్షణాల వల్ల చర్మం మెరుస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గిస్తుంది.

వయస్సు పెరిగే కొద్దీ శరీరం కొల్లాజెన్ ఉత్పత్తిని నెమ్మదిస్తుంది దీనివల్ల చర్మం ముడతలు పడి వృద్దాప్యానికి దారి తీస్తుంది. అయితే పచ్చి పసుపు చర్మాన్ని బలంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. తామర, అలోపేసియా, లైకెన్ వంటి చర్మ సంబంధిత సమస్యలకు పసుపు సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 11 , 2024 | 05:00 PM