Share News

Shocking Video: ఇదీ.. రైళ్లలో అమ్మే ఆహారం పరిస్థితి.. ఎలుకలు ఏం చేస్తున్నాయో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!

ABN , Publish Date - Jan 08 , 2024 | 09:13 PM

రైళ్లలో ప్రయాణించేటపుడు చాలా మంది ప్రయాణికులు స్టేషన్లలో లభించే ఆహారాన్ని కొని తింటుంటారు. రైళ్లలో విక్రయించే ఆహారం అపరిశుభ్రంగా ఉంటుందనే అనుమానం ఉన్నా వేరే దారి లేక తినేస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం ఇకపై అలాంటి ఆహారం తినడానికి ఎవరూ ధైర్యం చేయరు.

Shocking Video: ఇదీ.. రైళ్లలో అమ్మే ఆహారం పరిస్థితి.. ఎలుకలు ఏం చేస్తున్నాయో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!

రైళ్లలో ప్రయాణించేటపుడు చాలా మంది ప్రయాణికులు స్టేషన్లలో లభించే ఆహారాన్ని కొని తింటుంటారు (Food in Trains). రైళ్లలో విక్రయించే ఆహారం అపరిశుభ్రంగా ఉంటుందనే అనుమానం ఉన్నా వేరే దారి లేక తినేస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే మాత్రం ఇకపై అలాంటి ఆహారం తినడానికి ఎవరూ ధైర్యం చేయరు. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఇటార్సీ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించిన ఓ వీడియో చాలా మందికి షాక్ కలిగిస్తోంది.

ఇటార్సీ జంక్షన్ రైల్వే స్టేషన్‌లోని (Itarsi Junction railway station) ఐఆర్‌సీటీసీ స్టాల్‌లో (IRCTC Stall) ఉంచిన స్నాక్స్, ఇతర పదార్థాలపై ఎలుకలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి (Rats). ఎలుకలు ఆ స్టాల్ మొత్తం కలియతిరుగుతూ అన్ని ఆహార పదార్థాలను టేస్ట్ చేశాయి. అదే ఆహారాన్ని ఆ తర్వాత ప్రయాణికులకు విక్రయించేస్తుంటారు. Saurabh A Railfan అనే రైలు ప్రయాణికుడు ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చాలా మందికి భయాందోళనలు కలిగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Rats on Food).

ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ``ఎలుకలు ఫుడ్ ఇన్‌స్పెక్షన్‌కు వచ్చాయి``, ``అందుకే నేను రైళ్లలో అమ్మే ఆహారం తినను``, ``విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలి``, ``దేవుడా.. ఆ ఆహారం తిన్న వారి పరిస్థితి ఏంటి``, ``ఎన్ని చర్యలు తీసుకున్నా ఇది మారదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Jan 08 , 2024 | 09:13 PM