Share News

Viral: పులి తన పూర్తి సామర్థ్యం ప్రదర్శిస్తే.. లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే కనిపించే ద‌‌ృశ్యం!

ABN , Publish Date - Mar 25 , 2024 | 08:02 PM

ఒక్క అంగలో పులి జంప్ చేసిన వైనం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: పులి తన పూర్తి సామర్థ్యం ప్రదర్శిస్తే..  లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే కనిపించే ద‌‌ృశ్యం!

ఇంటర్నెట్ డెస్క్: పులులు కేవలం శక్తిమంతమైనవే కాదు రాజసం ఉట్టిపడేవి కూడా. అవి చేసే ఫీట్లు చూసేందుకు రెండు కళ్లు చాలవు. అత్యంత అరుదుగా మాత్రమే పులి తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శి్స్తుంది. ఇంకా చెప్పాలంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే కనిపించే దృశ్యం అది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: చదువుకున్నోళ్లలా ఉన్నారు..ఇలా చేసేందుకు మనసెలావచ్చిందో! షాకింగ్ వీడియో


ఈ వీడియోను ఐఆర్ఏఎస్ అధికారి అనంత్ రూపనగుడి షేర్ చేశారు. ఇటువంటి దృశ్యాలను నేరుగా చూడటం లైఫ్‌ ఒక్కసారే జరుగుతుందంటూ వీడియో తీసిన వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోలో ఓ పులి ఓ నీటి చెలమపై నుంచి అవతలివైపు ఒడ్డుకు ఒక్క అంగలో దూకుతుంది. స్లో మోషల్‌లో కనిపించే ఈ దృశ్యం అబ్బురపరిచేలా ఉందని అనంత్ కామెంట్ చేశారు (Tiger jump over a water body goes viral).

11 ఏళ్ల వయసులోనే బ్యాంకు దోపిడీ.. సెలవుల్లో స్కూలు పిల్లల దారుణం! ఎలా చేశారంటే..


కాగా, వీడియో చూసిన వారు కూడా పులిని చూసి ఆశ్చర్యపోతున్నారు. అది తన పూర్తి సామర్థ్యంతో దూకిందని, ఈ దృశ్యం చాలా అరుదైనదని కొందరు కామెంట్ చేశారు. ఇలాంటి విషయాల్లో పులి సింహం కంటే చాలా మెరుగైదని చెప్పుకొచ్చాడు. సింహం ధైర్యానికి ప్రతీక అయితే పులి ఫ్లెక్సిబిలిటీకి పరాకాష్ఠ అని చెప్పారు. ఇక జంతు నిపుణుల ప్రకారం, పులి అత్యంత ఎత్తుకు ఎగిరి దూకగలిగే జంతువు. ఒక్క జంప్‌తో ఏకంగా 20 అడుగుల ఎత్తును చేరుకోగలదు. అంతేకాకుండా, మరో 25 అడుగులు ముందుకు దూకగలదని నిపుణులు చెబుతారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 08:16 PM