Share News

Viral: చదువుకున్నోళ్లలా ఉన్నారు..ఇలా చేసేందుకు మనసెలావచ్చిందో..! షాకింగ్ వీడియో

ABN , Publish Date - Mar 25 , 2024 | 05:57 PM

సరదా పేరిట యువకులు చేసిన పనికి నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Viral: చదువుకున్నోళ్లలా ఉన్నారు..ఇలా చేసేందుకు మనసెలావచ్చిందో..! షాకింగ్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: బైక్‌పై ప్రయాణిస్తూ ఇద్దరు కుర్రాళ్లు చేసిన దురాగతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. సరదా పేరిట తాము చేసిన పని ఓ మనిషికి కూడు దూరం చేస్తోందన్న జ్ఞానం కూడా యువకులకు లేకపోవడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చదువుకున్నోళ్లలా ఉన్న వారు, ఇలాంటి చేష్టలకు దిగడాన్ని నెటిజన్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Juvenile Robbers: 11 ఏళ్ల వయసులోనే బ్యాంకు దోపిడీ.. సెలవుల్లో స్కూలు పిల్లల దారుణం! ఎలా చేశారంటే..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఇద్దరు యువకులు రద్దీ ట్రాఫిక్‌లో బైక్‌పై వెళుతూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. రోడ్డు పక్కన ఓ వ్యక్తి బండిపై అమ్ముకుంటున్న ద్రాక్ష పళ్లలో కొన్నింటిని చోరీ చేశారు. వీధి వ్యాపారి మరో కస్టమర్‌తో మాట్లాడుతూ బిజీగా ఉన్న సమయంలో బైక్ వెనక సీటుపై ఉన్న వ్యక్తి ఓ పళ్ల గుత్తి మొత్తాన్ని తీసుకుంటాడు. ఈ లోపల ట్రాఫిక్ కదలడంతో వాళ్లు చల్లగా జారుకుంటారు (Bikers steal Grapes for roadside vendor).

Viral: ఇది నిజమా..? చిన్న కిటుకుతో బండి మైలేజీ ఏకంగా 90 కేఎమ్‌పీఎల్!


యువకుల వెనకాల మరో బండిపై వెళుతున్న ఓ కుర్రాడు ఇదంతా గమనించి వారిని ప్రశ్నించారు. కానీ ఇదేమీ పెద్ద విషయం కానట్టు వాళ్లు భుజాలు ఎగరేయడం అతడికి ఆశ్చర్యమనిపించింది. అప్పటికే ఇదంతా అతడు రికార్డు చేసి ఉండటంతో వీడియోను నెట్టింట పంచుకున్నాడు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. పొట్టకూటి కోసం కష్టపడుతున్న వ్యక్తి నుంచి చోరీ చేసేందుకు ప్రయత్నించిన వారిపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. చదువుకున్న వాళ్లలా ఉన్న కుర్రాళ్లు మరీ ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారో అంటూ అనేక మంది నెట్టింట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Viral: మీ ఇంట్లో వేరే వాళ్లు ఉంటున్నారంటూ పక్కింటి వ్యక్తి నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 06:06 PM