Share News

Viral: ఇతడు ఫోన్‌పేతో అడుక్కుంటుంటే.. ఆనందంగా డబ్బులిస్తున్న జనాలు.. కథేంటంటే..

ABN , Publish Date - Mar 24 , 2024 | 08:54 PM

డిజిటల్ భిక్షగాడి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ఇతడు ఫోన్‌పేతో అడుక్కుంటుంటే.. ఆనందంగా డబ్బులిస్తున్న జనాలు.. కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ విప్లవంతో భారత్ రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు డబ్బు కోసం బ్యాంకుల్లో గంటల తరబడి క్యూలల్లో నిలబడాల్సి వచ్చేది. నేడు సంవత్సరానికి ఒకసారి కూడా బ్యాంకుకు వెళ్లనవసరం లేని పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా యూపీఐ కారణంగా రూపాయి కూడా మొబైల్ ఫోన్లతో చెల్లించే ఆస్కారం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఫోన్‌పేతో భిక్షణాటన చేస్తున్న ఓ వ్యక్తి వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: మీ ఇంట్లో వేరే వాళ్లు ఉంటున్నారంటూ పక్కింటి వ్యక్తి నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే..


గువహటీలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఓ రాజకీయ నాయకుడు దీన్ని షేర్ చేశారు. టెక్నాలజీకి హద్దులేమీ లేవని, మనుషుల మధ్య అంతరాలు చెరిపేస్తోందని అన్నారు. వీడియోలో కనిపించిన దాన్ని ప్రకారం కళ్లులేని ఓ వ్యక్తి (Digital Beggar) తన మెడలో ఫోన్ పే క్యూఆర్ కోడ్ వేసుకుని భిక్షాటన చేయసాగాడు. అతడి పరిస్థితి చూసి జాలి పడ్డ అనేక మంది సహృదయంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు ఇస్తున్నారు. డబ్బు పడ్డప్పుడల్లా అతడు ఫోన్ చెవిదగ్గర పెట్టుకుని ఎంత అకౌంట్లో పడిందీ తెలుసుకుంటున్నాడు. కాగా, వీడియోలో ఇదంతా చూసిన జనాలు తెగ ఆశ్చర్యపోతున్నారు. అయితే, అంధుడి పరిస్థితి మెరుగుపడ్డందుకు ఆనందం కూడా వ్యక్తం చేశారు.

IIT JEE: రోజుకు 17 గంటలు చదువుతున్న ఐఐటీ జేఈఈ విద్యార్థి! అతడిపై ఓ ఐఐటీ టాపర్‌ కామెంట్స్‌కు నెట్టింట ఆగ్రహం!


కాగా, గతంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. న్యూఢిల్లికి చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ అయేష శర్మ తాను ఫోన్ పే తోనే భిక్షాటన చేస్తానని చెప్పుకొచ్చింది. యూపీఐ అందుబాటులోకి వచ్చాక తనకు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం తప్పిందని వ్యాఖ్యానించింది. ట్రాన్స్‌జెండర్ కావడంతో బ్యాంకుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని పేర్కొంది. ప్రస్తుతం భిక్షాటన చేయగా వచ్చే సొమ్ములో సుమారు పావు శాతం ఫోన్ పే ద్వారానే వస్తోందని తెలిపింది. యూపీఐ ఉండటంతో చిల్లరలేని వాళ్లు కూడా భిక్ష వేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పింది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 09:00 PM