Share News

Python Vs Crocodile: మొసలి vs కొండచిలువ.. రెండింటిలో ఏది బలమైనది?.. వీడియో చూడండి..!

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:44 PM

మొసలి, కొండచిలువ.. బలాబలాల విషయంలో దేనినీ తక్కువ అంచనా వేయలేం. కొండ చిలువ సాధారణంగా ఎంతో బలంగా ఉంటుంది. ఇక, నీటిలో ఉన్న మొసలికి వెయ్యేనుగుల బలం ఉంటుంది.

Python Vs Crocodile: మొసలి vs కొండచిలువ.. రెండింటిలో ఏది బలమైనది?.. వీడియో చూడండి..!

అడవులలో పర్యటించడం ఎన్నో సర్‌ప్రైజ్‌లను అందిస్తుంది. చాలా కొద్ది మంది మాత్రమే అడవులపై, వన్య ప్రాణులపై ఆసక్తి కలిగి ఉంటారు. వారు అడవులలో జరిగే ఎన్నో అద్భుతమైన ఆసక్తికర ఘటనలను ప్రత్యక్షంగా చూస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇతరులు కూడా అలాంటి ఆసక్తికర వీడియోలను చూసి సర్‌ప్రైజ్‌కు గురవుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు నెటిజన్లను షాక్‌కు గురి చేశాయి.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం. ఆ వీడియోలో ఓ మొసలి, కొండ చిలువ భీకర పోరాటం సాగించాయి. మొసలి (Crocodile), కొండచిలువ (Python).. బలాబలాల విషయంలో దేనినీ తక్కువ అంచనా వేయలేం. కొండ చిలువ సాధారణంగా ఎంతో బలంగా ఉంటుంది. ఇక, నీటిలో ఉన్న మొసలికి వెయ్యేనుగుల బలం ఉంటుంది. ఈ రెండు భీకర పోరాటంలోకి దిగాయి. నీటిలో ఉన్న మొసలి నోటికి ఓ కొండ చిలువ చిక్కింది. ఇక, ఆ కొండచిలువను మొసలి తన దవడలతో దట్టిగా పట్టుకుంది. మొదట తప్పించుకునేందుకు ప్రయత్నించిన కొండచిలువ ఆ తర్వాత దాడికి దిగింది.

Emotional Video: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు రాక మానవు.. అక్క పెళ్లిలో బావ కాళ్లపై పడి ఎలా ఏడ్చాడో చూడండి.

ఆ మొసలిని చుట్టేసి దాని ఎముకలు విరిచేందుకు ప్రయత్నించింది. ఈ రెండూ కొద్ది సేపు తమ ప్రతాపాన్ని చూపించాయి. రెండింటిలో ఏదీ వెనక్కి తగ్గలేదు. చివరకు మొసలి తన పట్టును వదిలింది. దాంతో కొండ చిలువ ఒడ్డు పైకి వెళ్లిపోయింది. అలసిపోయిన మొసలి కాస్త ఊపిరి తీసుకుంది. yashfa9519 అనే ‌ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 5.6 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

Updated Date - Mar 20 , 2024 | 06:45 PM