Share News

Emotional Video: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు రాక మానవు.. అక్క పెళ్లిలో బావ కాళ్లపై పడి ఎలా ఏడ్చాడో చూడండి..

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:18 PM

అక్క లేదా చెల్లి పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంటే సోదరుడు పడే బాధ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఎంతటి వారికైనా కన్నీళ్లు రాకమానవు.

Emotional Video: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు రాక మానవు.. అక్క పెళ్లిలో బావ కాళ్లపై పడి ఎలా ఏడ్చాడో చూడండి..

ఒక వ్యక్తికి తన తల్లి తర్వాత తల్లి లాంటిది సోదరి (Sister). అందుకే సోదరి, సోదరుల బంధం ఎంతో ప్రత్యేకమైనది. అక్క లేదా చెల్లి పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంటే సోదరుడు (Brother) పడే బాధ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Emotional Video) చూస్తే ఎంతటి వారికైనా కన్నీళ్లు రాకమానవు. ఆ వీడియోలో ఓ కుర్రాడు తన బావ కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పక్కనే కూర్చున్న అతడి సోదరి కూడా వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది (Sister Marriage).

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెళ్లి జరుగుతోంది. వధూవరులు పీటల మీద కూర్చున్నారు. అంతలో వధువు సోదరుడు అక్కడకు వచ్చాడు. తన బావ కాళ్లపై పడి తన సోదరిని బాగా చూసుకోమని అభ్యర్థించాడు. ఎంతగానో ఏడ్చాడు. వరుడు ఆ కుర్రాడిని సముదాయించడానికి ప్రయత్నించాడు. బావమరిదిని పైకి లేపి కౌగిలించుకున్నాడు. పక్కనే కూర్చున్న వధువు.. సోదరుడి బాధ చూసి కన్నీళ్లు పెట్టుకుంది. చుట్టు పక్కల ఉన్న వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత ఆ కుర్రాడిని పక్కకు తీసుకెళ్లిపోయారు.

Viral Video: అబ్బా.. ఏం టెక్నిక్ ఆంటీ.. ఇలా అయితే గ్యాస్ చాలా కాలం వచ్చేస్తుంది.. వీడియో చూడండి..

@Gulzar_sahab అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 68 వేల మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన వారు భావోద్వేగానికి గురవుతున్నారు. ``ఇది నిజమైన ప్రేమ``, ``అన్న, చెల్లెలు ఒకరితో ఒకరు గొడవపడినా, సోదరి పెళ్లి సమయంలో ఎక్కువగా ఏడ్చేది అన్నదమ్ములే``, ``చాలా ఎమోషనల్ వీడియో``, ``నాకూ కన్నీళ్లు వచ్చాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 20 , 2024 | 06:18 PM