Share News

PM Modi: ‘వీ లవ్‌ పీఎం మోదీ’...! విద్యార్థుల ఆహ్వానం

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:14 PM

తిరుప్పూర్‌కు రానున్న ప్రధాని మోదీని ఆహ్వానించేలా, ‘వీ లవ్‌ పీఎం మోదీ’(We love PM Modi) అనే ఆంగ్ల అక్షరాల నమూనాలో పాఠశాల విద్యార్థులు కూర్చుని ఆకట్టుకున్నారు.

PM Modi: ‘వీ లవ్‌ పీఎం మోదీ’...! విద్యార్థుల ఆహ్వానం

చెన్నై: తిరుప్పూర్‌కు రానున్న ప్రధాని మోదీని ఆహ్వానించేలా, ‘వీ లవ్‌ పీఎం మోదీ’(We love PM Modi) అనే ఆంగ్ల అక్షరాల నమూనాలో పాఠశాల విద్యార్థులు కూర్చుని ఆకట్టుకున్నారు. ఈ నెల 27న ప్రధాని మోదీ తిరుప్పూర్‌ జిల్లా పల్లడం సమీపం మాదపూర్‌లో జరుగనున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధానిని ఆహ్వానించేలా, చెట్టిపాళయం వివేకానంద పాఠశాలకు చెందిన 650 మంది విద్యార్థులు ‘వీ లవ్‌ పీఎం మోదీ’ అనే ఆంగ్ల అక్షరాల నమూనాలో కూర్చొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.

nani6.jpg

Updated Date - Feb 25 , 2024 | 01:14 PM