Share News

Viral: ఎండ నుంచి బిడ్డను కాపాడేందుకు పావురాయి ప్రాణత్యాగం.. వైరల్ వీడియో!

ABN , Publish Date - May 30 , 2024 | 09:18 PM

బిడ్డల కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా తల్లి వెనకాడదని మరోసారి రుజువు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎండ నుంచి బిడ్డను కాపాడుకునేందుకు ఓ పావురం తన ప్రాణాలను కోల్పోయింది.

Viral: ఎండ నుంచి బిడ్డను కాపాడేందుకు పావురాయి ప్రాణత్యాగం.. వైరల్ వీడియో!

ఇంటర్నె్ట్ డెస్క్ : బిడ్డల కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా తల్లి వెనకాడదని మరోసారి రుజువు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. ఎండ నుంచి బిడ్డను కాపాడుకునేందుకు ఓ పావురం తన ప్రాణాలను కోల్పోయింది. నెటిజన్లను ఈ వీడియో కంట తడి పెట్టిస్తోంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ పావురం తన బిడ్డను ఎండ నుంచి కాపాడుకునేందుకు దాన్ని తన రెక్కల మాటున దాచింది. అలాగే చాలా సేపు ఉండిపోయింది. కనీసం నీరు ఆహారం కోసం కూడా అది అక్కడి నుంచి వెళ్లకపోవడంతో చివరకు ఎండ వేడి తట్టుకోలేక తల వాల్చేసింది. బిడ్డను మాత్రం తన రెక్కల మాటునే దాచి ఉంచింది.

వీడియోలోని వ్యక్తి చచ్చి పడి ఉన్న పావురాన్ని కాస్తంత పక్కకు జరపడంతో దాని రెక్క కింద ఉన్న పిల్ల పావురాయి కనిపించింది. తల్లి మరణించినా అది అక్కడే ఉండిపోయింది (Pigeon Dies Protecting Her Baby From Scorching Heat).

Viral: మీ ఇంట్లో స్ప్లిట్ ఏసీ ఉందా? అయితే ఎలర్ట్.. ఈ వీడియో చూస్తే..


వీడియో చూసిన అనేక మంది పావురానికి ఉన్న తల్లి ప్రేమ గురించి వేనోళ్ల పొడిగాడు, కొందరు మాత్రం వీడియోపై సందేహాలు వ్యక్తం చేశారు. వ్యూస్ కోసం ఎవరైనా తల్లి పావురాన్ని చంపి ఉంటారా అని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఈ అనుమానాలను కొట్టిపారేశారు.

కాగా, గతేడాది కోసం తల్లి ప్రేమను కళ్లకు కట్టినట్టు చూపించే వీడియో ఒకటి నెట్టింట ట్రెండింగ్ లో కొనసాగింది. ఇందులో ఓ పాము పక్షి గుడ్లు తినేందుకు దాని గూడులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన తల్లి పక్షి దాంతో చాలా సేపు పోరాడి దాన్ని బయటకు లాగేస్తుంది. కానీ, నేలపై పక్షి పాముతో పోరాడుతూనే తనువు చాలిస్తుంది. ఈ వీడియో అప్పట్లో జనాలను కదిలించింది.


Read Viral and Telugu News

Updated Date - May 30 , 2024 | 09:21 PM