Share News

Viral: టైమ్ ట్రావెల్ చేసి న్యూ ఇయర్‌ను రెండు సార్లు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:34 PM

ఈ నూతన సంవత్సర ఆరంభాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన సంస్థ వినూత్న ఐడియాతో కొందరు రెండుసార్లు న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

Viral: టైమ్ ట్రావెల్ చేసి న్యూ ఇయర్‌ను రెండు సార్లు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే..

ఈ నూతన సంవత్సర (New Year) ఆరంభాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines) విమానయాన సంస్థ విమానంలో ప్రయాణించి కొందరు రెండుసార్లు న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. అయితే అనుకోని కారణాల వల్ల వారి ఆశలు అడియాసలయ్యాయి. ``మీరు జీవించేది ఒక్కసారే. కానీ నూతన సంవత్సర వేడుకలను రెండుసార్లు జరుపుకోవచ్చు`` అంటూ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఇచ్చిన ప్రకటన చాలా మందిని ఆకట్టుకుంది (Time Travel).

పశ్చిమ పసిఫిక్ తీర ప్రాంతంలో ఉన్న గువామ్ (Guam) దేశం నుంచి హవాయిలోని హొనలులుకు (Honolulu) తమ విమానంలో (Time Travel Flight) ప్రయాణిస్తే రెండు సార్లు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవచ్చని తెలిపింది. రెండు ప్రాంతాల కాలమానల మధ్య ఉన్న వ్యత్యాసాల కారణంగా ఇది సాధ్యమే. UA200 విమానం 2024, జనవరి 1 ఉదయం 7:35 గంటలకు గువామ్‌లో బయలు దేరి 2023, డిసెంబర్ 31 సాయంత్రం 6:50 గంటలకు హవాయిలోని హోనోలులులో ల్యాండింగ్ కావాలి. ఈ విమానంలో ప్రయాణించేందుకు చాలా మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే విమానం ఆఅస్యం కావడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు.

Smart Phones: మీ పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా? అయితే ఈ టెక్నిక్ ఫాలో అవండి.. ఆ మహిళ ఏం చేసిందంటే..

షెడ్యూల్ సమయానికి ఆరు గంటలు ఆలస్యంగా జనవరి 1 మధ్యాహ్నం 1:49 గంటలకు గువామ్ నుంచిబయలుదేరిన విమానం హోనోలులులో ల్యాండ్ అయ్యే సమయానికి అర్ధరాత్రి దాటిపోయింది. దీంతో రెండు సార్లు న్యూ ఇయర్ జరుపుకోవాలనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. కాగా, ఇలాంటి టైమ్ ట్రావెల్ విమానాలను న్యూ ఇయర్ సందర్భంగా చాలా విమానయాన సంస్థలు నడుపుతుంటాయి. ఈ ఏడాది కూడా అలా కొన్ని విమనాలు టైమ్ ట్రావెల్ అనుభూతిని పంచాయి. ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ జనవరి 1వ తేదీ ఉదయం 12:48 గంటలకు టోక్యోలో బయలుదేరి డిసెంబర్ 31న సాయంత్రం 5:12 గంటలకు లాస్ ఏంజెల్స్ చేరుకుంది.

Updated Date - Jan 05 , 2024 | 06:34 PM