Smart Phones: మీ పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తున్నారా? అయితే ఈ టెక్నిక్ ఫాలో అవండి.. ఆ మహిళ ఏం చేసిందంటే..
ABN , Publish Date - Jan 05 , 2024 | 06:12 PM
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన సాధనంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా చాలా పనులు జరగడం లేదు. స్మార్ట్‌ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్నే అనర్థాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు మొబైల్స్‌కు బానిసలుగా మారిపోతున్నారు.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ (Smart Phone) అనేది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన సాధనంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా చాలా పనులు జరగడం లేదు. స్మార్ట్‌ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్నే అనర్థాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు మొబైల్స్‌కు బానిసలుగా (Smart Phone Addiction) మారిపోతున్నారు. ఎక్కువ సమయం మొబైల్స్‌తోనే గడిపేస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన పిల్లల మొబైల్ అడిక్షన్‌ను తగ్గించడానికి ఓ వింత ప్రయత్నం చేసింది. ఆ టెక్నిక్ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.
ఆ మహిళ పేరు మంజు గుప్తా. ఆమె మొబైల్ వ్యసనాన్ని తగ్గించేందుకు తన కుటుంబ సభ్యుల చేత ఓ ఒప్పందం చేయించింది. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ (Stamp Paper) పై హిందీలో రాసుకున్న ఒప్పందంలో మూడు నిబంధనలను ప్రస్తావించింది. అందులో మొదటిది.. ప్రతిరోజూ నిద్ర లేచిన తర్వాత మొదటగా మొబైల్ కాకుండా సూర్యూడిని చూడాలి. రెండు.. అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కలిసి భోజనం చేసేటపుడు మొబైల్‌ను దూరంగా ఉంచాలి. మూడు.. ఎవరూ తమ ఫోన్‌లను బాత్రూంలోకి తీసుకెళ్లకూడదు.
ఎవరైనా ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే, వారు ఒక నెల పాటు స్విగ్గీ లేదా జొమాటో ద్వారా ఆహారం ఆర్డర్ చేయడం కుదరదని ఆ స్టాంప్ పేపర్‌లో రాసి కుటుంబ సభ్యులందరి సంతకాలు తీసుకుంది. ఈ స్టాంప్ పేపర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 53 వేల మందికి పైగా ఆ పోస్ట్‌ను వీక్షించారు. మంజు ఐడియాను చాలా మంది మెచ్చుకున్నారు. ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య స్మార్ట్‌ఫోన్ అని చాలా మంది అభిప్రాయపడ్డారు.