Share News

Optical Illusion: మీ కళ్లకు పదునెక్కువా..? 15 సెకన్లలో జీబ్రాను పట్టుకోండి..!

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:14 AM

ఈ ఫొటోలో ఉన్న జంతువు (Animal) లేదంటే వస్తువును (Thing) గుర్తించాలని సోషల్ మీడియాలో తెగ పోస్టులు వస్తుంటాయి. అలా గుర్తిస్తే మీరు మరింత చురుగ్గా అవుతారని నిపుణులు చెబుతుంటారు. ఇంటర్నెట్‌లో (Internet) ఓ ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో అన్నీ జిరాఫీలు (Giraffe) ఉన్నాయి. ఒక జీబ్రా (Zebra) ఉంది.. ఎక్కడ ఉందో.. కేవలం 15 సెకన్లలో కనుక్కొవాలని కోరారు.

 Optical Illusion: మీ కళ్లకు పదునెక్కువా..?  15 సెకన్లలో జీబ్రాను పట్టుకోండి..!

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: ఈ ఫొటోలో ఉన్న జంతువు (Animal) లేదంటే వస్తువును (Thing) గుర్తించాలని సోషల్ మీడియాలో తెగ పోస్టులు వస్తుంటాయి. అలా గుర్తిస్తే మీరు మరింత చురుగ్గా అవుతారని నిపుణులు చెబుతుంటారు. ఇంటర్నెట్‌లో (Internet) ఓ ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో అన్నీ జిరాఫీలు (Giraffe) ఉన్నాయి. ఒక జీబ్రా (Zebra) ఉంది.. ఎక్కడ ఉందో.. కేవలం 15 సెకన్లలో కనుక్కొవాలని కోరారు. జిరాఫీలు (Giraffes) ఎక్కువగా ఉండటంతో కన్‌ఫ్యూజ్ కావడం ఖాయం. అలా చూస్తూనే ఉంటే మీకు జీబ్రా (Zebra) కనిపించే అవకాశం ఉంది.

అంతలా చూసినప్పటికీ ఫొటోలో జీబ్రా (Zebra) కనిపించలేదా.. తిరిగి ఫొటోను (Photo) తదేకంగా చూడండి. ఏకాగ్రతను ఏ మాత్రం తక్కువ చేయొద్దు. ఫొటోను (Photo) జూమ్ చేసి చూడండి. అలా చేయడంతో జీబ్రా (Zebra) ఎక్కడ ఉందో తెలిసే అవకాశం ఉంది.కంటిన్యూగా చూస్తే.. ఫొటో ఎడమ వైపు కింద మీకు జీబ్రా (Zebra) కనిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ జిరాఫీ (Giraffe) పక్కన వీపు మీద చరాలతో జీబ్రా (Zebra) ఉంది. హమ్మయ్యా.. తమకు జీబ్రా (Zebra) కనిపించిందని ఊపిరి పీల్చుకుంటున్నారా..? ఇలాంటి టాస్క్‌ చేస్తే మెదడుకు మేత వేసినట్టు అవుతోందని.. రోజంతా ఉత్సాహంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి రోజు చేసి ప్రొఫెషనల్ లైఫ్‌లో మరింత క్రియేటివ్‌గా ఉండాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 11:14 AM