Share News

Viral Video: వయసు మర్చిపోయి.. పబ్లిక్‌లో.. ఈ వృద్ధుల స్పీడు మామూలుగా లేదుగా..!

ABN , Publish Date - Feb 20 , 2024 | 06:36 PM

స్నేహబంధం గొప్పదనాన్ని మాటల్లో వర్ణించలేం. నిజమైన స్నేహితులను చూస్తేనే ఈ బంధం గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. అందుకే ప్రస్తుతం ఓ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

Viral Video: వయసు మర్చిపోయి.. పబ్లిక్‌లో.. ఈ వృద్ధుల స్పీడు మామూలుగా లేదుగా..!

ఇంటర్నెట్ డెస్క్: స్నేహబంధం గొప్పదనాన్ని మాటల్లో వర్ణించలేం. నిజమైన స్నేహితులను చూస్తేనే ఈ బంధం గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. అందుకే ప్రస్తుతం ఓ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో ఇద్దరు వృద్ధులు తమ వయసు మర్చిపోయి, నలుగురూ చూస్తున్నారన్న విషయాన్ని లెక్కచేయకుండా ఒకరినొకరు ఆటపట్టించుకున్నారు (Friendship between two elderly persons). ఈ సీన్ జనాలకు తెగ నచ్చేసింది.

Indian Railways: రైల్లో ఒంటరిగా వెళుతున్న యువతి..తానున్న బోగీలో దృశ్యాన్ని అక్కకు వాట్సాప్‌లో షేర్ చేయడంతో..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వృద్ధుడు సిగరెట్ వెలిగించుకునే పనిలో ఉండగా అతడి స్నేహితుడైన మరో వృద్ధుడు గట్టిగా ఊది అగ్గిపుల్ల ఆర్పేసి పారిపోయాడు. స్నేహితుడి తుంటరి పనిని పట్టించుకోకుండా ఆ వృద్ధుడు మరో అగ్గిపుల్ల వెలిగించగా ఆ స్నేహితుడు మళ్లీ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ అగ్గిపుల్లను ఆర్పేశాడు (One tries to light cigarette while another playfully stops). దీంతో, ఆ వృద్ధుడు చిన్నపిల్లాడిలా తన స్నేహితుడి వెంట పడ్డారు. ఇద్దరూ చిన్నపిల్లల్లా రోడ్డు మీద పరిగెత్తారు.

Empty Airplane: ఇద్దరే ప్రయాణికులతో బయలుదేరిన విమానం.. ఒంటరిగా ఉండటంతో తోటి ప్రయాణికుడు చేసిన పనికి..


వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు నిజమైన ఫ్రెండ్‌షిప్ అంటే ఇదే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా వీరి స్నేహం చెక్కుచెదరలేదంటే నిజంగా గ్రేటే అంటూ కొందరు కామెంట్ చేశారు. వీళ్లు చిన్ననాటి స్నేహితులై ఉంటారు. అందరూ ఇలాంటి ఫ్రెండ్‌షిప్‌నే కోరుకుంటారు. కానీ, కొందరికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది అని ఒకరు వ్యాఖ్యానించారు. జనాలకు ఈ దృశ్యాలు అమితంగా నచ్చడంతో వీడియోకు ఇప్పటివరకూ 40.9 లక్షల వ్యూస్ వచ్చాయి. నెట్టింట కాలు పెట్టి చాలా రోజులే అయినా ఇప్పటికీ జనాలు లైకులు, షేర్లతో వీడియోను ట్రెండింగ్‌లో (Trending) ఉండేలా చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2024 | 06:40 PM