Share News

Old Fridge: పనిచేయట్లేదని పాత ఫ్రిడ్జ్ ను అమ్మేస్తుంటారా? ఈ టిప్స్ తో దాన్ని మళ్లీ వాడుకోవచ్చు..!

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:43 PM

చాలా ఏళ్ల వినియోగం తరువాత ఫ్రిడ్జ్ పాతగా అయ్యాక పనిచేయకుండా మొరాయిస్తుంది. అయితే కొత్తది కొనేముందు పాత ఫ్రిడ్జ్ ను పాత సామాన్ల వాళ్లకు అమ్మేస్తుంటారు. నిజానికి పనిచేయని పాత ఫ్రిడ్జ్ లు అధిక ధరకు కూడా అమ్ముడుపోవు. వాటిని తిరిగి వాడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.

Old Fridge: పనిచేయట్లేదని పాత ఫ్రిడ్జ్ ను అమ్మేస్తుంటారా? ఈ టిప్స్ తో దాన్ని మళ్లీ వాడుకోవచ్చు..!

ఫ్రిడ్జ్ దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ చాలా ఏళ్ల వినియోగం తరువాత ఫ్రిడ్జ్ పాతగా అయ్యాక పనిచేయకుండా మొరాయిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొత్త ఫ్రిడ్జ్ కొనుగోలు చేయడం కామనే.. అయితే కొత్తది కొనేముందు పాత ఫ్రిడ్జ్ ను పాత సామాన్ల వాళ్లకు అమ్మేస్తుంటారు. నిజానికి పనిచేయని పాత ఫ్రిడ్జ్ లు అధిక ధరకు కూడా అమ్ముడుపోవు. అందుకే కొత్త ఫ్రిడ్జ్ కొంటున్నాం కదా అని పాతదాన్ని అమ్మేయకుండా ఈ చిట్కాలతో దాన్ని మళ్లీ వేరే పద్దతిలో వాడుకోవచ్చు. పాడైపోయిన పాత ఫ్రిడ్జ్ ను తిరిగి ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుంటే..

పాత ఫ్రిజ్‌ని అల్మారాగా మార్చుకోవచ్చు. లేదా స్టోర్ రూంలో ఉంచి అందులో రేషన్ పెట్టుకోవచ్చు.

వేసవిలో టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు..!


ఫ్రిడ్జ్ ను ఉపయోగించడానికి మరొక క్రియేటివ్ ఐడియా తోటలో ఉంచడం. బోన్సాయ్ మొక్కను ఫ్రిడ్జ్ లో నాటి దాన్ని తోటలో ఉంచితే తోటంతా ఆకర్షణగా కనిపిస్తుంది.

ఫ్రిడ్జ్ ను పై పద్దతులలోనే కాకుండా షూస్, చెప్పులు పెట్టుకోవడానికి షూ రాక్ గా కూడా ఉపయోగించవచ్చు.

ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్టైతే పిల్లలు, కుందేళ్లు వంటి చిన్న పెంపుడు జంతువులకు హోమ్ గా పాత ఫ్రిడ్జ్ ను వాడొచ్చు.

పాత ఫ్రిడ్జ్ ను కళాత్మకంగా ఉపయోగించాలని అనుకుంటే దాన్ని బుక్ షెల్ప్ గా మార్చేయవచ్చు. అందులో పుస్తకాలు ఉంచి అదనపు ఆకర్షణగా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు.

ఈ మధ్యకాలంలో స్మోకర్ గ్రిల్ చాలా వైరల్ గా మారింది. పని చేయని పాత ఫ్రిడ్జ్ ను ఉపయోగించి ఇంట్లోనే స్మోకర్ గ్రిల్ తయారుచేసుకోవచ్చు. పాత ఫ్రిడ్జ్ లను తిరిగి వినియోగించుకోవడానికి యూట్యూబ్ లో ఎన్నెన్నో ఐడియాలు ఉంటాయి. వాటిని చూసి పైన చెప్పుకున్నవే కాకుండా మరిన్ని కొత్త పద్దతులను కూడా ఫాలో అవ్వచ్చు.

వేసవిలో టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 01:43 PM