New Year : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే వెరీ డేంజర్..
ABN , Publish Date - Dec 31 , 2024 | 09:31 AM
న్యూ ఇయర్ పార్టీల్లో యువత చేసే సందడే వేరు. డీజే పాటలకు వేసే స్టెప్పులతో స్జేజీలు దద్దరిల్లుతాయి. షాంపేన్ పొంగి పొర్లుతుంది. మందు, చిందు లేకుండా నూతన సంవత్సర వేడుకలు చేసుకునేవారి సంఖ్య తక్కువే. కాబట్టి, న్యూ ఇయర్ పార్టీకి వెళుతుంటే..

గడచిన సంత్సరంలోని జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ కొత్త ఆశలు, ఆశయాలతో కొత్త సంత్సరానికి స్వాగతం పలికేందుకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గొప్ప అవకాశం. ఇక న్యూ ఇయర్ పార్టీల్లో యువత చేసే సందడే వేరు. డీజే పాటలకు వేసే స్టెప్పులతో స్జేజీలు దద్దరిల్లుతాయి. షాంపేన్ పొంగి పొర్లుతుంది. మందు, చిందు లేకుండా నూతన సంవత్సర వేడుకలు చేసుకునేవారి సంఖ్య తక్కువే. అందుకే జాగ్రత్తగా ఉండకపోతే సంతోషాన్ని మోసుకొచ్చే ఈ సెలబ్రేషన్స్ కొన్ని ప్రమాదాలు వెంటబెట్టుకొచ్చే అవకాశాలు అధికం. కాబట్టి, ఈ కింది టిప్స్‌ను మీ న్యూ ఇయర్ ప్లాన్స్‌లో భాగం చేసుకోండి. కొత్త సంవత్సరాన్ని మరింత అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దుకోండి.
డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త..
న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా అర్ధరాత్రి ఒకేసారి గుంపులు గుంపులుగా రోడ్ల పైకి వచ్చేస్తుంటారు. కేకులు కోస్తూ, బాణాసంచా కాలుస్తూ అల్లరి చేస్తుంటారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి తోటి వాహనదారులు, పాదాచారులకు ఆటంకం కలుగుతుంది. సమయానికి ఇళ్లకు చేరుకోలేరు. పార్టీ పూర్తయ్యాక సరదాకోసం అతివేగంగా వాహనాలు నడపడం, తాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం చేస్తే ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేసిన వాళ్లవుతారు. ఎందుకంటే, న్యూ ఇయర్ రోజునే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
వేడుకలు సురక్షితంగా చేసుకోండిలా..
మీ ఇంటికి దూరంగా వేడుకలు జరుపుకోవాలని అనుకుంటే సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. వెళ్లాల్సిన ప్రాంతం, రవాణా సౌకర్యాలు వంటివి అనుకున్నట్టుగా జరగపోతే ప్లాన్ బి సిద్ధం చేసుకోండి. ఒక వేళ పార్టీలో మద్యం సేవిస్తే క్యాబ్ లేదా ప్రజారవాణా ద్వారా మాత్రమే ఇంటికి వెళ్లండి. రోడ్డు ప్రమాదాలు నివారించిన వారవుతారు. మీ కారు లేదా బైక్ జనాలు ఎక్కువగా ఉన్న చోటే పార్క్ చేసుకుంటే.. తాగి అల్లర్లు చేసే వారి బారిన పడకుండా ఉంటారు. బయటికి వచ్చేటప్పుడు గుర్తింపు, క్రెడిట్ కార్డ్ సహా మీకు అవసరమైన వాటిని తప్పక వెంట తెచ్చుకోండి. విలువైన వస్తువలను ఇంట్లోనే వదిలేయండి.
పాదాచారులకు అత్యంత ప్రమాదకరమైన రోజు నూతన సంవత్సరమే అని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి, మీ సంతోషాలకు తోటివారి జీవితాలు బలవ్వకుండా ఉండేలా సురక్షితం న్యూ ఇయర్ వేడుకలతో కొత్త సంవత్సరానికి హలో చెప్పండి.