Viral: కోడలి అప్పగింతల కార్యక్రమం.. ముకేశ్ అంబానీ కన్నీళ్లు!
ABN , Publish Date - Jul 14 , 2024 | 06:40 PM
తన కుమారుడి పెళ్లిలో ముకేశ్ అంబానీ కన్నీరు కార్చిన వీడియో నెటిజన్లను కదిలిస్తోంది. కోడలు రాధికా మర్చెంట్ అప్పగింతల వేడుకకు సందర్భంగా ముకేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. స్వయంగా ఆడపిల్ల తండ్రైన ముకేశ్ భావోద్వేగాన్ని తాము అర్థం చేసుకోగలమని వీడియో చూసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీతో రాధికా మర్చెంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. న భూతో న భవిష్యత్ అన్నట్టు సాగిన ఈ వేడుకల్లో ప్రపంచ ప్రముఖులు అనేక మంది హాజరయ్యారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వివాహం జరిగింది. అనంత్ ఓ ఇంటి వాడైనందుకు అంబానీ దంపతులతో పాటు బంధువులు, స్నేహితుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. అనంత్ పెళ్లి సంరంభం ముగిసినా కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట ట్రెండింగ్‌లో (Viral) కొనసాగుతున్నాయి. ఇందులో ముకేశ్ అంబానీ కన్నీరు కార్చిన వీడియో నెటిజన్లను కదిలిస్తోంది.
Viral: వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠం ఇది.. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్
కోడలు రాధికా మర్చెంట్ అప్పగింతల వేడుకకు సంబంధించిన వీడియో ఇది. రాధికా మెల్లగా ముందుకు నడుస్తుండగా ఆమెను చూసి భావోద్వేగానికి లోనైన ముకేశ్ కన్నీరుకార్చారు. ముకేశ్ భావావేశాన్ని అర్థం చేసుకున్న నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. స్వయంగా ఒక కూతురికి తండ్రైన ఆయన ఇలా భావోద్వేగానికి లోనవడం సహజమేనని కొందరు అన్నారు. ఆయన నిష్కల్మషమైన మనసుకు ఈ ఘటన అద్దం పడుతోందని అందుకే ముకేశ్‌పై దైవకృప అపారమని వ్యాఖ్యానించారు (Mukesh Ambani shed tears at vidaai ceremony of bahu Radhika Merchant).
కాగా, అనంత్, రాధిక వివాహానికి దాదాపు 50 మంది గ్లోబల్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. అమెరికన్ నేత జాన్ కెర్రీ, బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయర్, బోరిస్ జాన్సన్, అడోబీ సీఈఓ శంతను నాయారణ్, కిమ్ కర్డేషియన్ వంటి ఎందరో వ్యాపార, ఎంటర్‌టైన్మెంట్ రంగ ప్రముఖులు ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.