Share News

Viral News: నిమ్మకాయ కోసం అర్థరాత్రి మహిళ ఇంటి తలుపు తట్టిన అధికారి.. తీరా చూస్తే మైండ్‌బ్లోయింగ్ షాక్

ABN , Publish Date - Mar 13 , 2024 | 09:51 PM

ఇది ముంబైలో చోటు చేసుకున్న ఓ వింత ఘటన. అతను ఓ సీఐఎస్ఎఫ్ (Central Industrial Security Force) అధికారి. ఒకరోజు అతను అర్థరాత్రి సమయంలో మహిళ ఇంటి తలుపు తట్టాడు. అంతే.. ఆ ఒక్క పరిణామం అతని జీవితాన్ని మార్చేసింది. భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరికి బాంబే హైకోర్టు కూడా అతనికి గట్టిగా మొట్టికాయలు వేసింది.

Viral News: నిమ్మకాయ కోసం అర్థరాత్రి మహిళ ఇంటి తలుపు తట్టిన అధికారి.. తీరా చూస్తే మైండ్‌బ్లోయింగ్ షాక్

ఇది ముంబైలో చోటు చేసుకున్న ఓ వింత ఘటన. అతను ఓ సీఐఎస్ఎఫ్ (Central Industrial Security Force) అధికారి. ఒకరోజు అతను అర్థరాత్రి సమయంలో మహిళ ఇంటి తలుపు తట్టాడు. అంతే.. ఆ ఒక్క పరిణామం అతని జీవితాన్ని మార్చేసింది. భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరికి బాంబే హైకోర్టు కూడా అతనికి గట్టిగా మొట్టికాయలు వేసింది. ఆ అధికారి పాల్పడిన చర్య అసభ్యకరమైందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతడు వేసిన పిటిషన్‌ని తిరస్కరించింది. అతనికి సీనియర్ అధికారులు విధించిన శిక్ష సరైనదేనంటూ కోర్టు సమర్థించింది. అసలేం జరిగిందంటే..

36 ఏళ్ల అరవింద్ కుమార్ ముంబైలోని బీపీసీఎల్ (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్)లో ఉద్యోగం చేస్తున్నాడు. అధికారిక నివాస గృహంలో ఉంటున్న అరవింద్.. 2021 ఏప్రిల్ 19-20 మధ్య అర్థరాత్రి సమయంలో పొరుగున తన ఆరేళ్ల కుమార్తెతో నివసిస్తున్న ఓ మహిళ ఇంటి తలుపు తట్టాడు. దీంతో ఆమె తలుపు తీసింది. అసలే అర్థరాత్రి, పైగా అరవింద్ కాస్త తేడాగా కనిపించడంతో.. ఆ మహిళ భయబ్రాంతులకు గురయ్యింది. తన భర్త ఉద్యోగ నిమిత్తం పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాడని, కాబట్టి తనని ఇబ్బంది పెట్టొద్దని ఆమె కోరింది. అయినా వెళ్లకపోవడంతో.. చివరికి ఆమె గట్టిగా హెచ్చరించింది. దీంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. తన ఆరోగ్యం బాగోలేదని, నిమ్మకాయ అడిగేందుకు వెళ్లానని అరవింద్ పేర్కొన్నాడు.


ఈ ఘటన గురించి సీఐఎస్ఎఫ్ సీనియర్ అధికారులకు తెలియడంతో.. అరవింద్‌పై వాళ్లు కఠిన చర్యలు తీసుకున్నారు. 2021 జులై నుంచి 2022 జూన్ వరకు పెనాల్టీ విధించారు. దీనిని సవాల్ చేస్తూ అరవింద్ బాంబే హైకోర్టు మెట్లెక్కాడు. తనపై విధించిన జరిమానాని రద్దు చేయాలని అందులో కోరాడు. ఈ పిటిషన్‌ని విచారించిన జస్టిస్ నితిన్ జామ్దార్, జస్టిస్ ఎంఎం సతయే ధర్మాసనం.. తప్పు అతనిదేనని తీర్పు చెప్పింది. అతనిపై విధించిన జరిమానాని రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ మహిళ ఇంటికి వెళ్లడానికి ముందు అరవింద్ మద్యం సేవించాడని, ఆ సమయంలో ఆమె ఇంట్లో భర్త లేడన్న సంగతి కూడా అతనికి తెలుసని పేర్కొంది. అతడు అసభ్యకరమైన చర్యకు పాల్పడ్డాడని ధర్మాసనం తీవ్రస్థాయిలో మండిపడింది.

భర్త లేడని తెలిసి కూడా ఒంటరిగా ఉంటున్న మహిళ ఇంటి తలుపులు తట్టడం.. కడుపునొప్పి అనే పనికిమాలిన సాకుతో నిమ్మకాయ కావాలని అడగడం.. చాలా అసహ్యకరమైందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐఎస్ఎఫ్‌లో పనిచేస్తున్న అధికారికి ఇలాంటి ప్రవర్తన తగదని చురకలంటించింది. అంతేకాదు.. తాను డ్యూటీలో లేని సమయంలో ఈ సంఘటన జరిగింది కాబట్టి, ఇది దుష్ప్రవర్తనకు సమానం కాదనే అరవింద్ వాదనని సౌతం ధర్మాసనం తోసిపుచ్చింది. సెంట్రల్ సివిల్ సర్వీస్ (ప్రవర్తన) నిబంధనల ప్రకారం అతను తన సమగ్రతను కాపాడుకోవాలని పేర్కొంది.

Updated Date - Mar 13 , 2024 | 09:51 PM