Share News

Marriage Life: సంసార జీవితం సజావుగా సాగాలంటే.. భర్తలు భార్యలకు అస్సలు చెప్పకూడని విషయాలు ఇవీ..!

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:41 PM

భార్యాభర్తల జీవితం సజావుగా సాగాలన్నా, వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు, గొడవలు లేకుండా ఉండాలన్నా కొన్ని టిప్స్ పాటించాలి. ముఖ్యంగా భర్తలు కొన్ని విషయాలు భార్యలకు చెప్పకుండా ఉండటం వల్ల భార్యాభర్తల వైవాహిక జీవితం సజావుగా సాగుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.

Marriage Life:  సంసార జీవితం సజావుగా సాగాలంటే.. భర్తలు భార్యలకు అస్సలు చెప్పకూడని విషయాలు ఇవీ..!

ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత అతి గొప్ప బంధం ఏదైనా ఉందంటే అది భార్యాభర్తల బంధమే. మధ్యలో ఒక్కటయ్యే ఈ బంధం చివర వరకు తోడు ఉంటుంది. భార్యాభర్తల జీవితం సజావుగా సాగాలన్నా, వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు, గొడవలు లేకుండా ఉండాలన్నా కొన్ని టిప్స్ పాటించాలి. ముఖ్యంగా భర్తలు కొన్ని విషయాలు భార్యలకు చెప్పకుండా ఉండటం వల్ల భార్యాభర్తల వైవాహిక జీవితం సజావుగా సాగుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. భర్త భార్యకు చెప్పకూడని ఆ విషయాలేంటో తెలుసుకుంటే..

ఆదాయం..

భర్త తన సంపాదన గురించి తన భార్యకు చెప్పకూడదట. భార్యలు పొదుపు చేసినప్పటికీ చాలాసార్లు భర్తకు ఎక్కువ ఆదాయం ఉన్నప్పుడు ఖర్చు విషయంలో కాంప్రమైజ్ కారట. దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.ఈ ఖర్చులు ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు డబ్బు కొరత ఏర్పడుతుంది.

డయాబెటిస్ ఉన్నవాళ్లు బెల్లంతో తినకూడదని ఆహారాలు ఇవీ..!


బలహీనత..

ప్రతి ఒక్క మనిషిలో బలహీనత ఉంటుంది.అలాగే భర్త తనలో ఉన్న బలహీనతను భార్య ముందు బయటపెట్టకపోవడం మంచిదట. భర్త బలహీనత ఏంటో భార్యకు తెలిస్తే కొన్ని సార్లు భార్య తను అనుకున్నది నెరవేర్చుకోవడానికి భర్త బలహీనతను ఉపయోగించుకుంటుందట. దీనివల్ల ఇంట్లోనూ, సమాజం నుండి అవమానాలను తప్పక ఎదుర్కోవలసి వస్తుంది.

సహాయం..

ప్రతి ఒక్క మనిషిలో కాస్తో కూస్తో దయా గుణం, సహాయం చేసే గుణం ఉంటుంది. భర్త ఎవరికైనా విరాళంగా డబ్బు ఇచ్చినా, ఇతరులకు సహాయం చేసినా దాన్ని భార్యకు చెప్పకపోవడం మంచిదట. ఒక చేత్తో చేసే సహాయం మరొక చేతికి తెలియకూడదు అని అంటారు. అలాగే భర్త చేసే సహాయం కూడా భార్యకు తెలియకుండా ఉండటం మంచిదట.

వేసవిలో టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు..!


అవమానం..

ఆఫీసులలో, స్నేహితుల దగ్గరా, బయట ఉన్నప్పుడు మగవాళ్లకు ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక సందర్భంలో అవమానం జరుగుతూ ఉంటుంది. భర్త తనకు జరిగే అవమానాన్ని ఎప్పుడూ భార్యకు చెప్పకూడదట. ఏ భార్యా భర్తకు జరిగే అవమానాన్ని సహించలేదట. జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా భార్య మాటలు ఉంటాయని, దీనివల్ల వివాదాలు పెరుగుతాయని చాణక్యుడు అన్నాడు. అందుకే భర్త తన అవమానం గురించి భార్యతో అస్సలు చెప్పకూడదట.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 20 , 2024 | 12:41 PM