Share News

Viral: పార్కులో లభించిన 17 కేజీల రాయి! బంగారం అనుకుని ఇంటికి తెస్తే..

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:13 PM

పార్కులో లభించిన ఓ రాయి బంగారం అనుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. చివరకు శాస్త్రజ్ఞులకు చూపిస్తే అది బంగారం కంటే విలువైన గ్రహశకలం అని చెప్పడంతో అతడు ఆశ్చర్యపోయాడు.

Viral: పార్కులో లభించిన 17 కేజీల రాయి! బంగారం అనుకుని ఇంటికి తెస్తే..

ఇంటర్నెట్ డెస్క్: గతంలో ఎన్నడూ చూడని రాయి అది. దాని లోపల బంగారం ఉండొచ్చని భావించి ఇంటికి తీసుకెళ్లాడు. రాయిని పగలగొట్టి లోపలేముందో తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. అలా 9 ఏళ్ల పాటు రాయి అతడి ఇంట్లోనే ఉండిపోయింది. చివరకు విసిగిపోయిన అతడు దాన్ని తీసుకెళ్లి మ్యూజియం వాళ్లకు చూపించాడు. దాని చరిత్ర ఏంటో శాస్త్రవేత్తలు చెప్పే సరికి ఆశ్చర్యపోయాడు. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే (Viral)..

డేవిడ్ హోల్ అనే వ్యక్తికి విలువైన రంగురంగుల రాళ్లు సేకరించడం అలవాటు. ఈ క్రమంలో అతడికి 2015లో పార్కులో వింత రంగులో ఉన్న రాయి లభించింది. ముందెన్నడూ చూడని తీరులో రాయి ఉండడంతో అందులోబంగారం లేదా వజ్రం ఉండొచ్చని భావించాడు. దాన్ని పగలగొట్టి తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశాడు. సుత్తితో కొట్టాడు, నేలపై విసిరాడు..ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా రాయి మాత్రం చెక్కుచెదరలేదు.

Viral: నేను చేసిన తప్పు మీరు చేయొద్దు.. ఓ తండ్రి ఆవేదన.. తిట్టిపోస్తున్న నెటిజన్లు


దీంతో, డేవిడ్ దాన్ని మెల్బోర్న్ మ్యూజియంకు తీసుకెళ్లి చూపించారు. దాన్ని పరీక్షించిన శాస్త్రజ్ఞులు ఆ రాయి అత్యంత అరుదైన గ్రహశకలమని తెలిపారు. అంగారకుడు, బుధుడు మధ్య ఉన్న గ్రహశకలాలా రాసి నుంచి అది భూమిపైకి పడిందని వివరించారు. ఘనీభవించిన ఇనుము ఇతర లోహాలతో తయారైందని, అందులోని స్ఫటికాలు చాలా గట్టివని చెప్పారు

దాదాపు 17 కిలోల బరువున్న ఈ గ్రహశకలం సుమారు వెయ్యేళ్ల క్రితం భూమిపైకి ఉల్కలా వచ్చి చేరిందని తెలిపారు. ఇది బంగారం కంటే విలువైనదని, దీన్ని అధ్యయనం చేసి విశ్వరహస్యాలను తెలుసుకోవచ్చని చెప్పుకొచ్చారు. ఇది మేరీబరో అనే పార్కులో దొరకడంతో దీనికి అదే పేరు కూడా పెట్టారు. ఇలాంటి గ్రహశకలాలు భూమ్మీద కేవలం 17 మాత్రమే ఉన్నాయని కూడా తెలిపారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ గ్రహశకలం ఖరీదు కొన్ని మిలియన్ల డాలర్లు ఉండొచ్చట.

Viral: మార్చరీలో జాబ్‌కు వింత పరీక్ష.. శవాల మధ్య 10 నిమిషాల పాటు.


అంతరిక్షం నుంచి భూమ్మీదకు చేరే గ్రహశకలాల్లో రాయితో పాటు వివిధ ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి మూడు రకాలు. సిలికేట్ ఖనిజాలు అధికంగా ఉన్న వాటిని స్టోనీ గ్రహశకలాలుగా పిలుస్తున్నారు. ఇరన్ గ్రహశకలాల్లో ఇనుము అధికంగా ఉంటుంది. ఇక స్టోనీ ఐరన్ గ్రహశకలాల్లో ఇనుము, సిలికేట్ ఖనిజాలు దాదాపు సమపాళ్లల్లో ఉంటాయట.

Read Latest and Viral News

Updated Date - Dec 28 , 2024 | 02:21 PM