Share News

Shocking: భారత్‌లోనే కాదు.. మలేసియాలోనూ ఇంతేనా?.. న్యూడిల్స్ తింటున్న వ్యక్తికి షాకింగ్ అనుభవం.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:04 PM

ఆహారంలో రకరకాల కీటకాలు, వింత వస్తువులు కనిపిస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో తరచుగా బయటపడుతున్నాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలోనే ఆహార తయారీ సమయంలో శుభ్రత పాటించరని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తుంటాయి

Shocking: భారత్‌లోనే కాదు.. మలేసియాలోనూ ఇంతేనా?.. న్యూడిల్స్ తింటున్న వ్యక్తికి షాకింగ్ అనుభవం.. ఏం జరిగిందంటే..

ఆహారంలో (Food) రకరకాల కీటకాలు, వింత వస్తువులు కనిపిస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో తరచుగా బయటపడుతున్నాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలోనే ఆహార తయారీ సమయంలో శుభ్రత పాటించరని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఘటన మలేసియాలో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది (Viral News).


మలేసియా (Malaysia)లోని స్థానిక రెస్టారెంట్‌ (Restaurant)లో భోజనం చేసిన షాన్ సెయిగీ అనే వ్యక్తి తన అనుభవానికి సంబంధించిన ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తి తన కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాడు. నూడిల్స్ తింటుండగా ఆ వ్యక్తికి ఏదో విచిత్రమైన వస్తువు కనబడింది. తీరా చూస్తే అది బ్యాండ్-ఎయిడ్ (Band aid). దెబ్బలు తగిలినపుడు అంటించుకునే స్టిక్కర్. అది చూసి ఆ వ్యక్తి షాకయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని పిలిచి నిలదీశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొచ్చిన వ్యక్తి గాయానికి అంటించుకున్న బ్యాండ్ ఎయిడ్ అలా ఫుడ్‌లో పడినట్టు తెలుసుకుని అందరూ షాకయ్యారు.


తాము భోజనం విషయంలో చాలా శుభ్రత పాటిస్తామని, ఇలా జరగడం ఇదే తొలిసారి అని, ఇలా జరిగినందుకు క్షమాపణలు చెబుతున్నామని రెస్టారెంట్ యజమాని సెయిగీ కుటుంబ సభ్యులను శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన సెయిగీ కుటుంబం రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. నెటిజన్లు ఆ రెస్టారెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వేగంగా వస్తున్న రైలు.. పట్టాలపై ఆగిపోయిన లారీ.. తర్వాతేం జరిగిందంటే..


Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. సడెన్‌గా కదిలిన చెత్త సంచి.. తర్వాత ఏం జరిగిందో చూస్తే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2024 | 12:04 PM