Share News

Kitchen tips: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. గ్యాస్ స్టవ్ బర్నర్స్ కొత్తవాటిలా మెరుస్తాయి..!

ABN , Publish Date - Feb 05 , 2024 | 04:10 PM

గ్యాస్ స్టవ్ బర్నల్స్ శుభ్రంగా లేకపోతే వంటకు అవసరమైన దానికంటే ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. అందుకే గ్యాస్ స్టవ్ బర్నర్స్ ఎప్పుడూ శుభ్రంగా ఉండటం అవసరం.

Kitchen tips: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. గ్యాస్ స్టవ్ బర్నర్స్ కొత్తవాటిలా మెరుస్తాయి..!

భారతీయుల ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ తప్పనిసరిగా ఉంటుంది. అన్ని వస్తువుల లాగే గ్యాస్ స్టవ్ కూడా వాడేకొద్దీ పాతబడుతుంది. మరీ ముఖ్యంగా వంట చేసేటప్పుడు పొంగడం, నూనె చిందడం, దుమ్ము,ధూళి వంటివి పడటం వల్ల గ్యాస్ స్టవ్ బర్నర్స్ నల్లగా మారిపోతుంటాయి. గ్యాస్ స్టవ్ బర్నల్స్ శుభ్రంగా లేకపోతే వంటకు అవసరమైన దానికంటే ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. అందుకే గ్యాస్ స్టవ్ బర్నర్స్ ఎప్పుడూ శుభ్రంగా ఉండటం అవసరం. ఇంట్లోనే సింపుల్ టిప్స్ తో గ్యాస్ స్టవ్ బర్నర్స్ ను శుభ్రం చేస్తే అవి శుభ్రపడటమే కాకుండా కొత్తవాటిలా మెరుస్తాయి కూడా.

ఉల్లిపాయ..

ఉల్లిపాయతో గ్యాస్ స్టవ్ బర్నర్స్ శుభ్రం చేస్తే కొత్తవాటిలా తళతళమంటాయి. ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి 20నిమిషాలపాటు స్టవ్ మీద ఉడికించాలి. చల్లారిన తరువాత ఈ నీటితో బర్నర్స్, గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేయాలి.

ఇది కూడా చదవండి: Breaking Bad Habits: ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు.. ఎంత చెడ్డ అలవాట్లు అయినా ఈజీగా వదిలించుకోవచ్చు..!


వెనిగర్..

బర్నర్స్ పై కొన్ని చుక్కల వెనిగర్ పోసి దాన్ని అలాగే కొన్ని నిమిషాలపాటూ వదిలేయాలి. ఆ తరువాత స్పాంజ్ సహాయంతో బర్నర్స్ ను శుభ్రం చేయాలి. తరువాత డిష్ వాష్ లిక్విడ్ తో శుభ్రం చేయాలి. ఇలా రెండు సార్లు చేస్తే బర్నర్స్, స్టవ్ కూడా మెరుస్తుంది.

బేకింగ్ సోడా..

రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం లేదా వైట్ వెనిగర్ తో బేకింగ్ సోడా కలపండి. ఈ మిశ్రమాన్ని బర్నర్‌కు అప్లై చేసి, దానిని పూర్తిగా శుభ్రం చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి.

నీరు, ఉప్పు..

నీటిలో ఉప్పు వేసి మరిగించాలి. బర్నర్ కాయిల్ను ఈవేడినీటిలో వేసి 15-20 నిమిషాలు నానబెట్టాలి. ఏదైనా చిన్న మరకలను శుభ్రం చేయడానికి హార్డ్ బ్రష్, డిష్ వాషింగ్ లిక్విడ్ ఉపయోగించాలి.

నిమ్మకాయ..

బర్నర్ను కొన్ని సెకన్ల పాటు వేడి చేసి ఆపై నిమ్మ తొక్కతోనూ, నిమ్మరసంతోనూ బాగా రుద్దాలి. దీన్ని కొన్ని నిమిషాలు అలాగే ఉంచి, ఆపై డిష్వాషింగ్ లిక్విడ్ ఉపయోగించి సాధారణ నీటిలో కడగాలి.

ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు ఈ 9పనులు చేస్తే చాలు.. పిల్లలలో కొండంత ఆత్మవిశ్వాసం నిండుకుంటుంది..!

డిష్ వాషింగ్ లిక్విడ్..

2 టేబుల్ స్పూన్ల డిష్ వాషింగ్ లిక్విడ్ ను ఒక కప్పు వేడి నీటిలో కలపాలి. ఈ ద్రావణంలో బర్నర్ను 5-7 నిమిషాలు నానబెట్టాలి. ఆపై మరకలను శుభ్రం చేయడానికి స్పాంజిని ఉపయోగించాలి.

పైనల్ గా..

కుళాయి నీటి ధార కింద బర్నర్స్ ను క్లీన్ చేయాలి. గ్యాస్ స్టవ్ ఉపయోగించిన ప్రతిసారి బర్నర్లను హార్డ్ బ్రష్ తో శుభ్రం చేయడం, కుళాయి నీటి ధారలో వాటిని శుభ్రం చేయడం వల్ల గ్యాస్ స్టవ్, బర్నర్లు ఎక్కువ కాలం మన్నిక వస్తాయి.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 04:10 PM