Share News

Kitchen Hacks: కిచెన్‌ సింక్‌ జామ్ అయ్యిందా? జస్ట్ ఇలా చేస్తే క్లీన్‌ అయిపోతుంది..!

ABN , Publish Date - Feb 11 , 2024 | 04:03 PM

Kitchen Hacks: వంట గదిలోని సింక్‌లో పదే పదే వాటర్ నిలిచిపోతున్నాయా? తరచుగా వాటర్ జామ్ అవడంతో చిరాకు పడుతున్నారా? ఈ సమస్య ను ఈజీగా పరిష్కరించేందకు సూపర్ టిప్ మీకోసం తీసుకువచ్చాం. సాధారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు వంట గదిలో ఏదో ఒక వంట చేస్తూనే ఉంటారు. వినియోగించిన ప్లేట్స్, బౌల్స్ అన్నీ వంటగదిలోని సింక్‌లో కడుగుతారు.

Kitchen Hacks: కిచెన్‌ సింక్‌ జామ్ అయ్యిందా? జస్ట్ ఇలా చేస్తే క్లీన్‌ అయిపోతుంది..!
Kitchen Hacks

Kitchen Hacks: వంట గదిలోని సింక్‌లో పదే పదే వాటర్ నిలిచిపోతున్నాయా? తరచుగా వాటర్ జామ్ అవడంతో చిరాకు పడుతున్నారా? ఈ సమస్య ను ఈజీగా పరిష్కరించేందకు సూపర్ టిప్ మీకోసం తీసుకువచ్చాం. సాధారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు వంట గదిలో ఏదో ఒక వంట చేస్తూనే ఉంటారు. వినియోగించిన ప్లేట్స్, బౌల్స్ అన్నీ వంటగదిలోని సింక్‌లో కడుగుతారు. అయితే, అలా పాత్రలు కడిగినప్పుడు అందులోని చిన్న చిన్న వ్యర్థాలు సింక్ పైపులో పేరుకుపోతాయి. తద్వారా నీరు జామ్ అయిపోతుంది. ఈ సమస్యతో చాలా మంది గృహిణులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, ఈ టిప్ పాటించడం ద్వారా సింక్ నుంచి వాటర్ ఫ్రీగా వెళ్లిపోతాయి. మరి సింక్‌‌లో నిలిచిపోయిన వ్యర్థాలు, నీరు ఈజీగా ఎలా క్లియర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వంటగది సింక్‌లో జామ్‌ అయిన వ్యర్థాలను తొలగించే ఈజీ టిప్స్ మీకోసం..

మరిగే నీటి విధానం..

కిచెన్ సింక్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో వేడి నీరు అద్భుతంగా పని చేస్తుంది. సింక్ పైప్‌లోని వ్యర్థాలన్నింటినీ ఈజీగా తొలగించేస్తుంది. ఇందుకోసం ఒక బౌల్‌లో వేడి నీటిని మరిగించాలి. ఆ నీటిని సింక్‌లో పోయాలి. ఇలా మూడు, నాలుగుసార్లు పోస్తే సింక్ పైపులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. వేడు నీరు పోయవడం వలన పైపులో పేరుకుపోయిన జిడ్డు, సబ్బు వంటి పదర్థాలు కరిగిపోయి.. క్లీన్ అవుతాయి.

బేకింగ్ సోడా, వెనిగర్..

బేకింగ్ సోడా, వెనిగర్‌ను మిక్స్ చేసిన యూజ్ చేయడం ద్వారా సింక్ పైప్ క్లీన్ అవుతుంది. సగం కప్పు బేకింగ్ సోడా వాటర్, వెనిగర్‌ను కూడా అంతే సమానంగా మిక్స్ చేయాలి. ఈ పధార్థాన్ని సింక్‌లో పోయాలి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ తరువాత వేడి నీటిని రెండు లేదా మూడుసార్లు పోయాలి. ఇలా చేయడం వలన సింక్‌లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.

ప్లంగర్ ఉపయోగించాలి..

ప్లంగర్‌ను ప్రతి ఇంట్లో ఉపయోగిస్తుంటారు. ఇది కూడా చాలా శక్తివంతంగా పని చేస్తుంది. ఇది టాయిలెట్ల కోసమే కాదు.. కిచెన్ సింక్‌లలో వ్యర్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ప్లంగర్‌తో పంప్ చేయడం ద్వారా కూడా సింక్‌లోని వ్యర్థాలు తొలగిపోయి క్లీన్ అవుతుంది.

బెంట్ వైర్ హ్యాంగర్..

వైర్ హ్యాంగర్‌తో కూడా సింక్‌లోని వ్యర్థాలను తొలగించవచ్చు. సింక్‌లో ఆహార వ్యర్థాలు, ఇతర పదార్థాలు పడి మూసుకుపోయినట్లయితే.. హ్యాంగర్‌కు హుక్‌ను సెట్ చేసి క్లీన్ చెయ్యవచ్చు. ఈ హుక్డ్ హ్యాంగర్‌ను సింక్‌ పైపులోకి జొప్పించి.. క్లీన్ చేయొచ్చు. చిన్న అడ్డంకులు తొలగించడానికి ఇది చాలా సులభమైన మార్గం.

కాస్టిక్ సోడా (సోడియం హైడ్రాక్సైడ్)..

కాస్టిక్ సోడా‌ను సోడియం హైడ్రాక్సైడ్ అని కూడా పిలుస్తారు. ఇది జిడ్డు, జుట్టు వంటి పదార్థాలను సైతం కరిగించగల శక్తివంతమైన రసాయనం. అయితే, దీనిని సరిగా వినియోగించాలి. లేదంటే.. మీ చర్మం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. సింక్ పైపు సైతం కాలిపోయే అవకాశం ఉంది. అందుకే.. కాస్టిక్ సోడాను ఉపయోగించడానికి ముందుగా తయారీదారుల సూచనల మేరకు నీటిలో కలపాలి. ఆపై జాగ్రత్తగా సింక్‌లో పోయాలి. కాసేపు అలా ఉంచిన తరువాత వేడి నీళ్లతో దాన్ని ఫ్లష్ చేయాలి. అయితే, కాస్టిక్ సోడాను ఉపయోగించేటప్పుడు హ్యాండ్ గ్లౌజ్‌లు, గాగుల్స్ ధరించాలి. అయితే, ప్రతిసారి కాస్టిక్ సోడాను వినియోగించొద్దు.

Updated Date - Feb 11 , 2024 | 04:03 PM