Share News

Pigeon: ఇదెక్కడి ట్రాప్‌రా.. పావురాలు పట్టుకోవడానికి ఏం చేశారో చూడండి..

ABN , Publish Date - May 15 , 2024 | 07:36 PM

పక్షుల్ని బంధించడానికి వినూత్నంగా ఓ మెష్ ఏర్పాటు చేశాడో వ్యక్తి. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో సరదాగే ఉన్నా.. నెటిజన్లు మండిపడుతున్నారు. కుంగ్రాడ్ అనే యూజర్ ఇన్ స్టాగ్రామ్‌లో దీన్ని షేర్ చేశాడు.

Pigeon: ఇదెక్కడి ట్రాప్‌రా.. పావురాలు పట్టుకోవడానికి ఏం చేశారో చూడండి..

ఇంటర్నెట్ డెస్క్: పక్షుల్ని బంధించడానికి వినూత్నంగా ఓ మెష్ ఏర్పాటు చేశాడో వ్యక్తి. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో సరదాగే ఉన్నా.. నెటిజన్లు మండిపడుతున్నారు. కుంగ్రాడ్ అనే యూజర్ ఇన్ స్టాగ్రామ్‌లో దీన్ని షేర్ చేశాడు.

వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం... ఒకతను పక్షుల మెష్ తయారు చేస్తాడు. అందులో ప్రత్యేకతముంది అనుకుంటున్నారా. ముందుగా ఒక గొయ్యి తీసి దానిపై మెష్ లాంటిదాన్ని ఏర్పాటు చేశాడు. దాంట్లో విత్తనాలు వేసి పక్షులకు వల వేశాడు.


విత్తనాలను తినడానికి వచ్చిన పావురాలు ఆహారం కోసం దూకి గొయ్యిలోకి పడిపోతాయి. ఇలా చాలా పావురాలు, పక్షులు అందులోకి చేరుతాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన కొందరు నెటిజన్లు సదరు వ్యక్తి ట్యాలెంట్ ను ప్రశంసిస్తుండగా మరికొందరు పక్షులను హింసించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 89 మిలియన్ల మంది వీక్షించారు. చాలా మంది తమ స్పందనలను కామెంట్ చేశారు. ఒక వినియోగదారుడు తన కామెంట్లో.. ఇది పక్షులకు చేస్తున్న తీరని ద్రోహం అని రాసుకొచ్చాడు.

Read Latest Viral News and Telugu News

Updated Date - May 15 , 2024 | 07:36 PM