Viral: దారుణం.. ఐరన్ మ్యాన్ సినిమా స్ఫూర్తిగా ప్రాణాలతో చెలగాటం!
ABN , Publish Date - Jul 08 , 2024 | 08:40 PM
ఐరన్ మ్యాన్ సినిమా స్ఫూర్తిగా ఓ చైనా వ్యక్తి తన కాల్లో గుచ్చుకున్న ఇనుపముక్కలను విద్యుదయస్కాంతంతో బయటకు తీసేందుకు ప్రయత్నించి పరిస్థితిని జటిలం చేసుకున్నారు. వైద్యులు చివరకు శస్త్రచికిత్స ద్వారా బయటకు తీశారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: సినిమాలు ఉన్నది చూసి ఎంజాయ్ చేయడానికే. అంతకుమించి సినిమాలకు ప్రభావితమైతే ప్రాణాలతో చెలగాటమాడినట్టే. ఇది తెలిసిన కొందరు పెద్దలు కూడా అప్పుడప్పుడూ తమకు నచ్చిన సినిమాల్లోని పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని తలకిందులవుతుంటారు. అలాంటి ఓ ఘటన తాజాగా చైనాలో వెలుగు చూసింది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ (Viral) అవుతోంది.
ఐరన్ మ్యాన్ సినిమాలో హీరో పాత్రధానిపై బాంబు దాడి జరుగుతుంది. కొన్ని ఇనుప వస్తువులు అతడి దేహంలోకి చొచ్చుకుపోతాయి. దీంతో, హీరో విద్యుదయస్కాంత ఆకర్షణతో వాటిని శరీరంలోంచి బయటకు లాగేస్తాడు. ఇక, హుబే ప్రావిన్స్‌కు చెందిన జియాంగ్‌కు ఐరన్ మ్యాన్ సినిమాలంటే చాలా ఇష్టం. ఇటీవల అతడు ఓ పరిశ్రమలో పనిచేస్తుండగా ఓ భారీ విస్ఫోటనం సంభవించింది. ఆ ధాటికి ఎగిరొచ్చిన కొన్ని ఇనుప ముక్కలు అతని కాల్లో దూసుకుపోతాయి. అలాంటి ప్రమాద సమయంలో అతడికి తన ఫేవరెట్ సినిమా గుర్తొచ్చింది (Inspired By Iron Man Chinese Man Uses Magnet To Remove Metal Shards From Leg).
Viral: సమంత తరువాత మరో ప్రముఖ వ్యక్తిని టార్గెట్ చేసుకున్న ‘ది లివర్ డాక్’!
దీంతో, అతడు తన కాల్లో గుచ్చుకున్న ఇనుప ముక్కలను విద్యుదయస్కాంతంతో తీసే ప్రయత్నం చేశాడు. అవి బయటకు రాకపోగా నొప్పి మరింత ఎక్కువవడంతో చివరకు ఆసుపత్రికి వెళ్లక తప్పలేదు. సినిమాలో కూడా హీరో చివరకు ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలీదా అని వైద్యులు కూడా ప్రశ్నించారు. అత్యాధుని మైక్రో సర్జరీ చేసి వాటిని తొలగించారు.
ఈ ఉదంతం నెట్టింట కూడా వైరల్‌గా మారింది. శరీరంలో ఏదైనా గుచ్చుకున్నప్పుడు గాయం వద్ద ఉన్న కండ తనంతట తానుగా మూసుకుపోయి గాయాన్ని మాన్నే ప్రయత్నం చేస్తుందని కొందరు చెప్పుకొచ్చారు. కాబట్టి, ఇనుప ముక్కలవంటివి గుచ్చుకున్నాక అవి శరీరంలోకి ప్రవేశించిన మార్గం దానంతట అదే మూసుకుపోతుందని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులు మాత్రమే వాటిని జాగ్రత్తగా బయటకు తీయగలరని పేర్కొన్నారు.