Share News

April Fool's Day : కొలిగ్స్‌పై ఈ చిలిపి ఆలోచనలు ప్రయత్నించి ఏడిపించండి..!

ABN , Publish Date - Apr 01 , 2024 | 01:08 PM

ఆఫీస్‌కి రాగానే మీ కొలీగ్ మొదటిగా ప్రసాంతంగా కూర్చుని తన ముందున్న సిస్టం ఆన్ చేస్తాడు కనుక.. వైర్ లెస్ మౌస్‌ని మార్చి పెట్టండి. అది కనెక్ట్ కాక తికమక పడుతుంటే అప్పుడు నవ్వుతూ బయట పెట్టండి.

April Fool's Day : కొలిగ్స్‌పై ఈ చిలిపి ఆలోచనలు ప్రయత్నించి ఏడిపించండి..!
Fool's Day

ఏప్రిల్ ఫూల్స్ డే, (April Fool's Day) సరదాగా దగ్గరి వాళ్ళను, స్నేహితుల్ని ఉన్నది, లేనట్టు, జరగనిది జరిగింది అన్నట్టుగా కాస్త చిలిపితనంతో ఏడిపిస్తూ ఉంటారు. ఏప్రిల్ ఫూల్స్ డే నాడు ముఖ్యంగా సహోద్యోగులపై ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఈ చిలిపి తనాన్ని, అల్లర్లను (prank ideas) కాస్త జాగ్రత్తగా చేయాలనుకుంటే మాత్రం వీటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.

డెస్క్ మేక్ఓవర్

ఉద్యోగులంతా ఆశ్చర్యపోయేట్టు డెస్క్ ని కాస్త చిత్రంగా అలంకరిస్తే సరి. రంగు రంగుల వెర్షన్స్ తో మార్చేయండి. కాస్త తికమక చేసినా సరిపోతుంది. కుర్చీలకు కలర్స్ నింపేయడం, కాగితాలు అతికించడం వంటి చిలిపితనాన్ని కలిపి ఆలోచించండి. ఉదయాన్ని అక్కడ కూర్చునే వాళ్లకు చిత్రమైన ఫీల్ కలిగే విధంగా ఆలోచించండి.

టెక్ ట్రబుల్స్

ఆఫీస్‌కి రాగానే మీ కొలీగ్ మొదటిగా ప్రసాంతంగా కూర్చుని తన ముందున్న సిస్టం ఆన్ చేస్తాడు కనుక.. వైర్ లెస్ మౌస్‌ని మార్చి పెట్టండి. అది కనెక్ట్ కాక తికమక పడుతుంటే అప్పుడు నవ్వుతూ బయట పెట్టండి. ఈ చిలిపితనం పెద్దగా నొప్పించదు, పైగా కాస్త నవ్వుకునేలా చేస్తుంది. వెంటనే ఎదుటివారు మామూలు స్థితికి వచ్చేసి నవ్వేస్తారు తప్పితే తప్పుగా తీసుకునే అవకాశం ఉండదు.

ఇవి కూడా చదంవండి:

వేసవి చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు..!!

పదునైన కంటి చూపుకోసం 8 సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

ప్రపంచంలో అతి చిన్న జీవులు ఇవే..

వేసవిలో ఆకుకూరలు తినడం వల్ల..

ది మిస్టరీ స్నాక్

కొలిగ్స్ కి ఈరోజు ప్రత్యేకంగా భోజనాన్ని ఆఫర్ చేయండి. అందులో రకరకాల పదార్థాలను చేర్చి కాస్త ఆశ్చర్య పరచండి. ఏదైనా పదార్థాన్ని వడ్డించి కారం ఎక్కవ కలపండి. లేదా ఫూట్స్ కి ఫుడ్ కలర్ ఎక్కించి కొరికి తినగానే నోటికి రంగు అంటేలా చూడండి. ఇది కాస్త నవ్వుకునేలా చేయాలి కానీ.. మరీ ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. ఈ విషయాన్ని గమనించుకుంటూ ప్రయత్నించండి.


కాఫీ కప్

చిలిపి పనులు నవ్వుల్ని పూయిస్తాయి. కాఫీ క్రీమర్ బాటిల్స్ పై లేబుల్స్ వింతగా ఉండేలా డిజైన్ చేయండి. కాఫీ టేస్ట్ కూడా చక్కని రుచులతో మార్చేయండి. కాఫీ మొదటి సిప్ చేయగానే కొలిగ్స్ షాక్ అయ్యేలా చేయండి.

జుట్టు పెరుగుదలకు మాంసాహారం మంచిదేనా..!

డెస్క్ ఇన్ఫిల్ట్రేషన్ (Desk Infiltration)

రోజంతా సహోద్యోగి డెస్క్‌ వాతావరణాన్ని మార్చేందుకు చిన్న చిన్న చిలిపి ఆలోచనలు చేయండి ప్రత్యేకంగా ఈరోజు పరవాలేదు. ఎవరినీ ఇబ్బందికి గురిచేయకుండా, ఆనందంగా ఉండేందుకు చిన్నచిన్న పేపర్‌క్లిప్ లేదా రబ్బరు బ్యాండ్, క్యూట్ బొమ్మలు నచ్చిన వస్తువులతో నింపేయండి. రోజు పూర్తయ్యే సరికి డెస్క్ లో పేరుకునే చిన్న చిన్న వస్తువులు అందరికీ మంచి గుర్తుగా మిగిలిపోతాయి.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 01:11 PM