Viral: బామ్మ చెప్పినట్టు చేసి లాటరీ కొట్టాడు.. పెద్దల మాట చద్ది మూట అంటే ఇదే
ABN , Publish Date - Jul 05 , 2024 | 09:29 PM
అదృష్టం ఎప్పుడోకప్పుడు మాత్రమే తలుపు తడుతుంది. అన్న తన అమ్మమ్మ మాటలు విన్న ఓ అమెరికన్ అందులోని సూక్ష్మాన్ని అర్థం చేసుకుని జాక్ పాట్ దక్కించుకున్నాడు. ఏకంగా 50 వేల డాలర్లు గెలుచుకున్నాడు. అమెరికాలోని బాల్టీమోర్‌లో ఈ ఘటన గెలిచింది.

ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం ఎప్పుడోకప్పుడు మాత్రమే తలుపు తడుతుంది. అన్న తన అమ్మమ్మ మాటలు విన్న ఓ అమెరికన్ అందులోని సూక్ష్మాన్ని అర్థం చేసుకుని జాక్ పాట్ దక్కించుకున్నాడు. ఏకంగా 50 వేల డాలర్లు గెలుచుకున్నాడు. అమెరికాలోని బాల్టీమోర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా (Viral) మారుతోంది.
Viral: వేల కోట్ల ఆస్తి ఉన్నా.. 30 ఏళ్లుగా చీరలు కొనని సుధామూర్తి! ఎందుకంటే..
జూదం లాగానే లాటరీ కూడా ఓ వ్యసనంగా మారే ప్రమాదం లేకపోలేదు. కాబట్టే, లాటరీ సంస్థలు కూడా దీన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోవద్దని, లాటరీ దక్కుతుందన్న గ్యారెంటీ ఉండదని చెబుతుంటాయి. సదరు అమెరికా వ్యక్తి బామ్మ కూడా ఇదే విషయాన్ని విషయాన్ని చెప్పింది. లాటరీపై అతిగా ఆశపెట్టుకోవద్దని హెచ్చరించింది. ఈ సూచనను తనదైన రీతిలో అన్వయించుకున్నాడా వ్యక్తి. ఓ తెలివైన పని పథకాన్ని అమలు చేశాడు. నిత్యం లాటరీ టిక్కెట్లు కొనకుండా అప్పుడప్పుడూ లాటరీ మీద బాగా మనసు పోయినప్పుడు రెండే టిక్కెట్లు కొనేవాడు. రెండింట్లో ఏ ఒక్క దానికి ఆఫర్ తలిగినలా మరో టిక్కెట్ కొనేవాడు లేకపోతే మళ్లీ కొన్నాళ్ల పాటు విరామం ఇచ్చేవాడు. ఈ ట్రిక్ ఆశించిన ఫలితాన్నే ఇచ్చింది. ఇటీవలే అతడు ఏకంగా 50 వేల డాలర్లు గెలుచుకున్నారు (Grandmothers Wisdom Leads Maryland Man To 50 000 Scratch Off Win).
తన బామ్మమాటను అమల్లో పెట్టి చాలా లాభపడ్డానని అతడు చెప్పుకొచ్చాడు. ఈ లాటరీతో కలుపుకుని ఇప్పటివరకూ 2 లక్షల డాలర్లు గెలుచుకున్నట్టు చెప్పుకొచ్చాడు. కాస్తంత తెలివి, కాస్తంత అదృష్టం కలిసి రావడంతో మంచి డబ్బు కళ్లబడి అతడి ఆనందానికి అంతేలేకుండా పోయింది.