Share News

Viral Video: వరుడికి బహుమతిగా కామసూత్ర సోఫా.. పాపం.. వధువు ఎంతలా సిగ్గు పడిందో..

ABN , Publish Date - Feb 11 , 2024 | 07:07 PM

తాజాగా జరిగిన ఓ వివాహంలో వరుడి కోసం అతడి ఫ్రెండ్స్ ఓ భారీ గిఫ్ట్ తెచ్చారు. వేదికపై ఆ బహుమతి చూసి వధువు సిగ్గుతో తల వంచుకుంది.

Viral Video: వరుడికి బహుమతిగా కామసూత్ర సోఫా.. పాపం.. వధువు ఎంతలా సిగ్గు పడిందో..

పెళ్లిలో (Marriage) వధూవరుల స్నేహితులు, బంధువులు చేసే అల్లరికి హద్దు ఉండదు. పెళ్లి చేసుకుంటున్న వారికి వెరైటీ గిఫ్ట్‌లు (Wedding Gifts) ఇవ్వాలని వారి స్నేహితులు రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కాలంలో ఎంత వెరైటీగా ఆలోచిస్తే అంత మంచిదని అనుకుంటున్నారు. అయితే ఆ వెరైటీ శృతి మించితే మాత్రం అభాసుపాలు కాక తప్పదు. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది. ఆ వీడియోలోని వరుడి స్నేహితులపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో వరుడి (Groom) కోసం అతడి ఫ్రెండ్స్ ఓ భారీ గిఫ్ట్ తెచ్చారు. దానిపై ఓ తెల్లని వస్త్రం కప్పేసి వేదిక పైకి తీసుకెళ్లారు. అదేంటో తెలియక చాలా మంది ఆశ్చర్యంగా చూశారు. అయితే ఆ గిఫ్ట్‌పై ఉన్న వస్త్రం తొలగించగానే అందరూ షాకయ్యారు. ఎందుకంటే వరుడి స్నేహితులు ఇచ్చిన ఆ బహుమతి ఓ``కామసూత్ర సోఫా`` (Kama Sutra sofa). ఆ సోఫాను రొమాంటిక్ కార్యకాలపాల కోసమే వినియోగిస్తారు. ఆ గిఫ్ట్‌ను చూసిన తర్వాత వధువు (Bride) సిగ్గుతో సైలెంట్ అయిపోయింది. అయితే వరుడి ఫ్రెండ్స్ ఏమీ లెక్కచేయండా ఆ సోఫా పక్కన నిలబడి వధూవరులతో కలిసి ఫొటోకు పోజిచ్చారు.

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 14 లక్షల మందికి పైగా వీక్షించారు. 5 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``స్నేహితుడి భార్యను అందరి ముందు ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యమా``, ``ఇది చాలా వెకిలిగా ఉంది``, ``సరదాకు కూడా హద్దులు ఉండాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 11 , 2024 | 07:07 PM